April 19, 2021

నిదురమ్మా... నిదురమ్మా


నిదురమ్మా నిదురమ్మా
బికారి రాముడు (1961)
రచన: పాలగుమ్మి పద్మరాజు 
గానం: శ్రీరంగం గోపాలరత్నం
సంగీతం: బి. గోపాలం 

పల్లవి: 

నిదురమ్మా నిదురమ్మా
కదలీ వేగమె రావమ్మా 

నిదురమ్మా నిదురమ్మా
కదలీ వేగమె రావమ్మా 

చరణం 1:

బ్రతుకున బాధల బరువు తీర్పగా 
మదిలో రగిలే మంటలార్పగా 

చరణం 2:

పాలా మబ్బుల పాన్పు వేసి 
నీలాలా తెర పైన మూసీ 
పాలా మబ్బుల పాన్పు వేసి 
నీలాలా తెర పైన మూసీ

గాలీ వీవన బూని హాయిగా 
జోలలు పాడీ పోవమ్మా 

చరణం 3:

కలతలతో నా కన్నతండ్రి 
కలతలతో నా కన్నతండ్రి 
ఆకులపడి శాంతిసుఖాల నెరుగడు 
అలసట తీర్చే తీయని కమ్మని 
కలల దేల్చి కాపాడగరమ్మా