మలి సందె చలిలోన
బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
గానం: బాలు, జానకి
పల్లవి:
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
చెలి ఉంటే నాకాడ చెయ్యూరుకోదు
చేతుల్లో చెయ్యేస్తే మనసూరుకోదు
వయసు నిదురపోదు
నా వయసు నిదురపోదు
వయసు నిదురపోదు
నా వయసు నిదురపోదు
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
చెలికాడు తోడుంటే మనసూరుకోదు
మనసిచ్చుకున్నాక వయసూరుకోదు
కంట నిదురరాదు
చరణం 1:
తెల్లగున్న మల్లెనిప్పుతో
మంట పెట్టిందాక తానూరుకోదు
ఏటవాలు చూపు...ఎద మీద వాలితే
పైట జారిందాకా తానూరుకోడు
ఎన్ని తిప్పలో ఏమి చెప్పనూ
ఎన్ని సిగ్గులో ఎట్ట మోయనూ
సిగ్గుపడ్డ బుగ్గ
మొగ్గలేసే వేళా
దగ్గరౌతు ఉంటే
దడ పుడుతుంటే
చరణం 2:
మూడు మూరకొక్క ముద్దుతో
చీర కట్టిందాకా తానూరుకోడు
కొంటెబాసలున్న కంటితో
జంట చేరిందాకా తానూరుకోదు
ఎన్ని ఆశలో పడుచువాడిలో
ఎంత దూకుడో వలపు నాడిలో
ఈడు మాయచేసే
వేడి మంత్రమేసి
షోకు తాకువేళా
సొమ్మసిల్లుతుంటే...
No comments:
Post a Comment
Leave your comments