February 16, 2021

తారారం తారారం



చెప్పరాదా... చేతకాదా
కిరాయి అల్లుడు (1983)
రచన: వేటూరి 
సంగీతం: చక్రవర్తి 
గానం: బాలు, సుశీల 

పల్లవి:

తారారం తారారం తారారం తారారం
చెప్పరాదా చేతకాదా
వేళకాదా మాటలేదా
మరులో...మనసో
నీ చిలిపి కనులలో 
వలపు నీడలే తెలిసే

తారారం తారారం తారారం తారారం
చెప్పబోతే మాట రాదు
చెప్పకుండా ఆగలేను
మనసే మరులై
నా అదుపు దాటి 
నీ బదులు కోసమే నిలిచే

చరణం 1:

మసక చీకటవ్వంగానే 
మల్లె మొగ్గ విచ్చంగానే 
మనసే మాట వినకుంటాది ఎట్టాగమ్మా 

చందమామ పుట్టంగానే 
సన్నజాజి పెట్టంగానే 
ముద్దూముచ్చట్లాడాలంటే ఎట్టాగమ్మా

గుర్తొస్తుంటే ఒయ్యారం 
కులుకేలేని జాగారం 
ఈ మూగనోములింక ఎన్నాళ్ళమ్మా 
ఈ మూడు పొద్దులెట్ట గడపాలమ్మా 

కాలాలేమో బరువాయే 
కౌగిళ్ళేమో కరువాయే 
ఇంతకన్నా చెప్పాలంటే ఎట్టాగమ్మా 

చరణం 2:

అద్దంలోకి చూడాలంటే 
అతనే ఎనక కనిపిస్తుంటే 
మోమాటంగా మోమెట్టానే చూసేదమ్మా 

బుగ్గన చేయి పెట్టంగానే 
సిగ్గులు వేయి పుట్టంగానే 
కన్నె మొగ్గ గన్నేరైతే ఎట్టాగమ్మా

కవ్విస్తూంటే జతగాడు 
కొరికేస్తుంటే చలిగాడు 
ఈ తోట పొదలింకా ఎన్నాళ్ళమ్మా 
ఏ రాయబారమింకా చెయ్యాలమ్మా 

దూరాలన్నీ ఇరుకాయే 
భావాలన్నీ వలపాయే 
చెప్పేదింకా చేతల్లోనే చూపాలమ్మా 
తారారం తారారం తారారం తారారం