February 24, 2021

ఏ స్వరములో....పదములో


ఏ స్వరములో 
మంచిరోజు (1991)
సంగీతం: నరేంద్రనాథ్ 
రచన: వేటూరి 
గానం: చిత్ర 

పల్లవి: 

ఏ స్వరములో....పదములో 
వినబడే మనసులో 
నీ పెదవితో పెదవులే 
కలబడే వయసులో 
నే వ్రాసుకున్న 
ఈ ఓనమాలు 
నీతోన సాగే 
నా సంగమాలు 
కవితలై పలికె మదిలో 

ఏ స్వరములో...పదములో 
వినబడే మనసులో 
నీ పెదవితో పెదవులే 
కలబడే వయసులో 

చరణం 1:

తొలి ఋతువుకూ గాలి 
నవరంగులే 
చిలక గారాల చిరునగవులై 
పొద ఎదుట మొగ్గైన ముసినవ్వులే    
వలపుటందాల సిగపువ్వులై 
కనులు కలబడు 
కలిగి అలజడి
తనువు తహతహమందిలే  
మరులు తగిలిన 
విరులు రగిలిన 
కవిత వయసుకు కౌగిలే 
మరులుకొని విరులవని
కబురువిని కలతపడి 

చరణం 2:

మెరుపులకు ఆషాఢ 
శృతిలయలతో 
ఉరుముటుయ్యాల 
దొరికినదిలే.... 
పరువమొక హేమంత 
చలిమంటగా 
ఉడికి ఊరించి 
చంపినదిలే.... 

నుదుట విడివడి 
ఎదుట నిలబడి 
మనసు విరహిణి గీతమై.... 
తొలి వసంతపు 
వెలుగు మరకలు 
మిగిలె ముగిసిన గాథలై...
కనులగురి కలలసిరి 
కలిపినది చిలిపి మది