కల కందామా
ఆడపులి (1984)
సంగీతం: చక్రవర్తి
రచన: ఆత్రేయ
గానం: బాలు, జానకి
పల్లవి:
కల కందామా
నువ్వూ నేనూ
కలిసి కాపురం చేస్తున్నట్టు
కలిసుందామా
నువ్వూ నేనూ
గంగా యమునలు ఒకటైనట్టు
రాగాలలో అనురాగాలలో
రాగాలలో అనురాగాలలో
నీదీ నాదీ నేడూ రేపూ ఓ బాటగా
కల కందామా
నువ్వూ నేనూ
చరణం 1:
పలకరించు నీ చూపులు
అవి పగలే పొడిచే చుక్కలు
కథలు పలుకు నీ స్నేహము
నా నుదుట నిలుపు సింధూరము
తేనెలు చిలుకూ నీ పలుకే
ప్రేమకే సుగంధం
నీ చిరునవ్వులు నా సిరులే
నీవు నా వసంతం
నీవే నాకై ఇలలో వెలిసే బృందావనం
చరణం 2:
ప్రేమ అన్నదొక వేదము
అది అంతము లేని గీతము
జీవితమన్నది పెన్నిధి
అది దొరికె నాకు నీ సన్నిధి
పున్నమి కలువలు నీ ఒడిలో
నన్ను ఒదిగిపోనీ
ఊహలకందని కౌగిలిలో
ఈ ఊపిరాగిపోనీ
నీలో శృతిగా ఎదలో స్మృతిగా
నేనుండనీ
No comments:
Post a Comment
Leave your comments