February 27, 2021

నా మనసులో



నా మనసులో 
మంచిరోజు (1991)
సంగీతం: నరేంద్రనాథ్ 
రచన: వేటూరి 
గానం: బాలు, మిన్ మిని   

పల్లవి: 

నా మనసులో 
గుసగుసే తెలియదా తమరికీ... 

ఈ విరహమే 
సరసము తెలుసుకో ప్రియసఖీ...

తెల్లారి పోనీ ఈడల్లరీ
గిల్లేడిపించే చలి కీచురాయి 
కనులలో నిదుర చెదిరే 

చరణం 1:

చలి గొడవ రేగేటి సకిలింతలో 
మతులు పోయాక మగడెందుకు 
వంటింటి కుందేటి చిరుగంతులో 
పరువు తీయొద్దు పదిమందిలో 
కలల అలజడి 
కనుల ముడిపడి 
తనువు తహతహ చూడవా 
మనువు జరిగిన 
మనసు మరిగిన 
చిలిపి గిలగిల చూడవా 
మెడకుగల పసుపు ముడి 
అదరదని బెదరదని 
  
చరణం 2:

తొలిజన్మ పూజల్లో 
నలుసేవిటో 
కరిగే కౌగిళ్ళ కసి కాలమూ 
సొగసుండి వయసుండి 
ఏం లాభమూ 
పడుచు కుంపట్లో పొడి బేరమూ 
చెరుకు పెదవికి 
ఇరుకు గడియలు 
వలపు చిలకలు అలిగెనే 
పరుపు నలగని 
పైట తొలగని 
అసలు కథ మరి ఎన్నడో 
సతిపతుల కితకితలు 
ఇతరులకు తగనివని