మలి సందె చలిలోన
బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
గానం: బాలు, జానకి
పల్లవి:
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
చెలి ఉంటే నాకాడ చెయ్యూరుకోదు
చేతుల్లో చెయ్యేస్తే మనసూరుకోదు
వయసు నిదురపోదు
నా వయసు నిదురపోదు
వయసు నిదురపోదు
నా వయసు నిదురపోదు
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
మలి సందె చలిలోన
మసక చీకట్లోన
చెలికాడు తోడుంటే మనసూరుకోదు
మనసిచ్చుకున్నాక వయసూరుకోదు
కంట నిదురరాదు
నా కంట నిదురరాదు