February 24, 2021

సొగసుల రాణివే చెలి...ఓ చెలి



సొగసుల రాణివే 
మంచిరోజు (1991)
సంగీతం: నరేంద్రనాథ్ 
రచన: వేటూరి 
గానం: మనో, కీరవాణి  

పల్లవి: 

సొగసుల రాణివే చెలి...ఓ చెలి 
సరిగమ పాణివే మణి...హార్మణి 
పాటలు వెతికే పల్లవి పిల్లవి 
ఆటలు అడిగే జావళి జాణవి 
పదములు చాలవు మెచ్చగా 
పరువము పైటను గిచ్చగా 
నీకు సరి గడసరి లేరే నారీ 
సొగసుల రాణివే చెలి...ఓ చెలి 
సరిగమ పాణివే మణి...హార్మణి 

చరణం 1:

చిలకల కొలికివి నీవే 
నేనా... 
పలుకుల పలకలు తేవే 
నాకా...
నడుమును చకచక చూసి
చూసీ... 
తకధిమి దరువులు వేసా 
ఆశ... 
నీ వల్లె మాట ఎంకి పాటంటా 
ఏటంటా ...
వంపులన్ని బాపూ బొమ్మంటా 
పొమ్మంటా..
నీ కంటిచూపు తేనెటీగంటా   
ఏ గంటా...
నీ టాపు చూస్తే సత్యభామంటా 
శశివదనా 
కొసరితే కసరుచు విసరకు నీ జడనే 
మనగలనా 
మగసిరి కలిగిన మనసుని ఛీ అంటే....
సలహా వినవే చెలిగా మనవే 
కలహాల కథే గిలిగింతలుగా 
నీ ఉరవడి చొరవలు పడవిక పద ఇక  

చరణం 2:

తొలకరి వయసిక నాదే 
నాదే
వలపుల వరసలు నావే
నావే...
వనితకు పురుషుడు నేనే 
నేనే
మదనుడి మనవడు వీడే 
వీడే 
నవ నవలిక మనవేలే
మనువులే 
తళుకుల తడి మనకొరకే 
కొర కొరే  
నిగనిగ నగవులు విసిరే 
కసిరెలే 
పెర పెర పెదవులు పిలిచే    
ప్రియసఖియా 
పరువపు కలలను కళలను గిలకొడితే 
నను వలచే 
చిలిపిగ తెలిపిన ఎద సొద వినపడలే 
అరె ప్రియసఖి పిలిచెను 
నను గని వలచెను 
బిడియము విడిచెను 
తన ఒడి పరచెను 
సరసము ముదిరెను 
సమరము రగిలెను 

పోరా.. ఓ రోమియో కుమారా 
నా ప్రేమలో దుమారా 
కొట్టావా నాటుసారా...ఆ...!  

లుచ్చా 
లవ్వింగులోనా బచ్చా 
నువ్వేరా నాకు మచ్చా 
నీకేల ఇంత కచ్చా 
కుడతా 
మిడతా 
పిడతా 
ఉడతా
తిడతా  
కొడతా 
భరతం 
పడతా 
డొక్కచించి డోలుకట్టి
చొక్కా చించి జోలి కట్టి 
లొట్టిపిట్ట గుట్టుపెట్టి 
జుట్టు పీకి 
జూలు పెడతా