ఊహల్లో ఆవేశం
సంగీతం: నరేంద్రనాథ్
రచన: వేటూరి
గానం: బాలు, చిత్ర
పల్లవి:
ఊహల్లో ఆవేశం
తారల్లో ఆకాశం
పరువాల స్వాగతం
పలికిందిలే
ఒకనాటి బంధం
వలపుల్లో పందెం
ఎడబాటు లేని
ఎదలో వసంతం
ఊహల్లో ఆవేశం
తారల్లో ఆకాశం
చరణం 1:
నీలమేఘాల చిలిపి మెరుపుల
పూలబాణాలే తగిలి తనువుల
మంటపాలలో చలిమంటగా...
వానజల్లేదో కురిసి చినుకుల
సోయగాలెన్నో తడిసి పిడిచిన
కౌగిలింతలో జత లెత్తగా
లిపి దొరకని కన్ను రాసే
కనులెరుగని వెన్ను పూసై
చదువడగని ప్రేమలేఖ
ఎద గడపను దాటలేక
మౌన గాన మంత్రమాయెనే
చరణం 2:
మాయ జింకల్లే మెరిసి పిలిచిన
స్వప్నరాగాలే చెదిరి విడిచిన
యవ్వనాలనే సరిచేసుకో
నీడలేవేవో ముసిరి బ్రతుకున
నల్ల పారాణే అలవి అలసిన
జీవితాలనే కడిగేసుకో
ఋతువులకొక రాగమున్నా
బ్రతుకిక అనురాగమన్నా
అతిథిగ నిను చేరుకున్నా
సతి వలె నిను కోరుకున్నా
ఎంత గాఢమైన బంధమో...