February 24, 2021

టాం... టాం... టాం... కొట్టి



టాం... టాం... టాం... కొట్టి
మంచిరోజు (1991)
సంగీతం: నరేంద్రనాథ్
రచన: సిరివెన్నెల
గానం: ఉమా రమణన్

రాజీ...రవణా...
అమ్మడూ...సుబ్బులూ...
రండి రండి రండి రండి
మూఢం వెళ్ళే మూడో నాడే
నా పెళ్ళంటా...
లగ్గం పెట్టారోయ్....
 
పల్లవి:

టాం టాం టాం కొట్టి  
చెప్పాలండి ఇంటింటికి
టాం టాం టాం కొట్టి  
చెప్పాలండి ఇంటింటికి
తింటారంట పప్పన్నం
తొందర్లో
 
పీ...పీ...పీ... అని
తప్పెట్లు తాళాలతో
డివ్వీ డివ్వీ డివ్విట్టం పందిట్లో
ఆహా నా పెళ్ళంటా
ఓహో నా పెళ్ళంట
అమ్మ నగలన్నీ పెట్టుకోవచ్ఛంటా
బూర్లు, బొబ్బట్లు ఎంచక్కా
తింటూ తిరగొచ్చంట

చరణం 1:

అల్లుడికొచ్చా చింతపిక్కలాట
ఎల్లాగైనా నేరిపించుకుంటా
ఉయ్యాలుందా వియ్యాలారి ఇంటా
నట్టింట్లో వేసి పెట్టమంటా
వింటాడా చెప్పినట్టు కాస్తా
కాదంటే ఇంక జట్టు ఉండనంటా
చద్దన్నం తినరంటగ పట్నంలో
వద్దంటే అక్కడసలుండనంట
సుబ్బరంగా ఇక్కడుండి  
సంబరంగా ఉంటుందంటూ
పేచీ పెట్టేసి వచ్చేస్తా

చరణం 2:

కాకెంగిల్ని ఒప్పుకోవు కాదే
మొగుడంటే ముద్దులేంచేస్తావే
 
నేనేమైనా చంటిపిల్లనంటే
అంటూ సొంటూ చెప్పలేనంటే

అవన్నీ ఒదిలేస్తేనే
అవుతారంటే అమ్మానాన్న

నన్నిట్ఠా మరి బెదిరిస్తారే
సాయం రండి మీరెవరైనా

ఒప్పుకోరే పెద్దోళ్లెవరూ
ఒక్కదాన్నే తోసేస్తారు
ఆమ్మో ఏం చేద్దాం చెప్పండే