January 30, 2021

అద్దిరబన్నా... హైసర బజ్జా


అద్దిరబన్నా హైసర బజ్జా
ఘరానా గంగులు (1981)
సంగీతం: సత్యం 
రచన: కొసరాజు 
కోరస్ 

అద్దిరబన్నా హైసర బజ్జా
చిన్నవాడు రామసామి 
చిలకలంగి తొడిగినాడు 
తెల్లగుర్రం ఎక్కినాడు 
మల్లెపూలు పెట్టినాడు 
అద్దిరబన్నా హైసర బజ్జా
అద్దిరబన్నా హైసర బజ్జా

పట్టిన పట్టు వదిలితె ఒట్టు 
కలిపి కొట్టరా కావేటి రంగా 
నిలిపి కొట్టరా నెల్లూరి రంగా 
గుంటూరు గోంగూర 
చిత్తూరు సిరికూర 
బాపట్ల వంకాయ 
రాజమండ్రి ఆవకాయ 
పాలకొల్లు బత్తాయి 
గోలుకొండ ద్రాక్షకాయి 
రాయపూడి జామకాయ 
అద్దిరబన్నా హైసర బజ్జా
అద్దిరబన్నా హైసర బజ్జా

పొద్దుటూరు నెయ్యీ 
చెయ్యి మునగ బొయ్యీ 
బెజవాడ పెరుగు 
తిన్నదంత అరుగు 
బందర్ మిఠాయి 
తింటేను హాయి 
అద్దిరబన్నా హైసర బజ్జా
అద్దిరబన్నా హైసర బజ్జా

కట్టమీద పాలపిట్ట 
కొట్టబోతె తేలుకుట్టె
కొండమీద కోతి 
ఎర్రగుంది మూతి 
ఏలూరు చిన్నదీ 
ఎదురుగా ఉన్నది 
రంగైన చిన్నదీ 
రానూ పొమ్మన్నది 
పెద్దోళ్ళ మాట 
సద్ది కూటి మూట 
ఏడుకొండలెక్కు 
ఎంకన్నకు మొక్కు 
కోటి విద్యలెందుకు
కూడు పెట్టేటందుకు 
పాటు చేసేదెందుకు?
పొట్ట నిండేటందుకు 
మనిషి పుట్టిందెందుకు?
మంచి చేసేటందుకు 
అద్దిరబన్నా హైసర బజ్జా
అద్దిరబన్నా హైసర బజ్జా