March 29, 2021

చిత్తడి చిత్తడి వాన



చిత్తడి చిత్తడి వాన 
కంచుకవచం (1985)
కృష్ణ-చక్ర
వేటూరి 
బాలు, సుశీల 

పల్లవి:

చిత్తడి చిత్తడి వాన
ఇది చినుకుల సందడి వాన 
ఒత్తిడి ఒత్తిడి లోన 
ఇది కురిసింది పరువాన 

ఓయ్ ఒణికిన వలపుల తోటీ 
వానకు వయసుకు భేటీ 

నీ వెచ్చని ఒళ్ళో 
వేసవి గుళ్ళో 
వేడిగా కాస్త చోటీయ్ 

చరణం 1:

ఎన్ని వంపులో మేని విరుపులో 
ఎంచి చూసుకోనా 
వన్నె చిన్నెలా కన్నె సిగ్గులు 
వంచి కోసుకోనా 

చినుకు దీపమెత్తుకుంటూ 
సిగ్గులన్ని చిదుముకుంటూ 
చినుకు దీపమెత్తుకుంటూ 
సిగ్గులన్ని చిదుముకుంటూ 
వానదేవుడి పూజచేసి 
వయసు హారతి ఇచ్చుకోనా  

నీ మెరిసిన కళ్ళు 
తడిసిన ఒళ్ళు 
మెత్తగా హత్తుకోనా
 
చరణం 2:

వయసు వేడిని వాన చినుకులు 
ఆర్పలేని వేళ 
వానచినుకులే 
నిన్ను తాకితే ఆవిరైన వేళా 

జల్లులోనే అల్లుకుంటూ 
నన్ను నీలో దాచుకుంటూ 

మబ్బుతల్లికి మంత్రమేసి 
ముద్ద తడుపే తడుపుకోనా 

నీ ఉరిమిన ఈడు 
తరిమిన వేళా 
గుండెలో దాగిపోనా