March 29, 2025

జగదీశ్వరా పాహి పరమేశ్వరా...

చిత్రం: సువర్ణసుందరి(1957)
సంగీతం: ఆదినారాయణరావ్
రచన: సముద్రాల
గానం: జిక్కి, కోరస్

పల్లవి :  

ఓం...
నమశ్శివాయః సిద్ధం నమః 
ఓం... 
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
హిమగిరిదేవర
శశిధరశేఖర 
నిన్నే శరణంటిరా 
నీవే గతియంటిరా
ఓ...

రామదాసు దేవదాసు హరికథ

రామదాసు దేవదాసుల హరికథ 
(నూతన్ ప్రసాద్)
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: కోపెల్ల శివరాం, ఎమ్వీయల్  
నేపథ్యగానం: బాలు

సీ మద్రమారమణ గోవిందో హా...రి 
భక్తులారా కామందులారాయ్ 
మరీ ఏటీ 
మన్నుతిన్న పాముల్లా 
మందుకొట్టిన సాముల్లా ఉన్నారు 
మత్తూ నిద్రమత్తూ వదిలేసి 
మళ్ళీ ఒకసారి 
ఏదీ 
నాయనా ఆర్మనీ 
సుతిచేసుకో నాయనా 
సుతుంటే మనిషి మనిషవుతాడు 
మంచోడే అవుతాడు 
సుతితప్పిన మడిసి పశువవుతాడు 
మతిలేనోడవుతాడు 
అదేనయ్యా నేను చెప్పే హరికథ   
సీ మద్రమారమణ గోవిందో హారి

సీరామ నామమ్ము 
సరవస్వమని నమ్మి 
ఊరోళ్ల సొమ్మంతా 
గుడికోసం జమచేసి 
గోవిందా... గోవిందా...
అప్పూల పాలాయెరా 
ఈ రామదాసు 
అప్పులదాసాయే 
చిప్పా చేతికి వచ్చే 
రామయ్య దయలేదురా  
రామా..! 
బతుకే మాయనుకుని 
భక్తి మందు తాగి 
ఒళ్ళు తెలియక 
రామదాసు కాసులేనోడయితే.. 

ఆడి బెదరు... దేవదాసు 
పారవతి దక్కక 
మనసు ఇరిగి 
మందు మరిగి 
ఇంటి ధ్యాసలేనోడయ్యాడు 
ఎలా అయ్యాడయ్యా 

కల్లు సారాయిలె మనసారా తలపోసి 
తన సొమ్ము కరగేసి 
తాగుడికే తగలేసి 
పీపాలు తెగతాగెను ఈ దేవదాసు  
టావ్ టడ డావ్ 
డొడ డ్యావ్ డ్యావ్ డ్యావ్ డ్యావ్

జగమే మాయని ఊగెను 
పారు పారూ పారు పారూ
జగమే మాయ బతుకే మాయ 
వేదాలలో సారా ఇంతేనయా 
సారా ఇంతేనయా

నాయనా ఆర్మనీ 
వాయించడం మటుకే నీ పని 
దగ్గు నాది... నా సొంతం 
అది నువ్ సెయ్యమాక 
ఆహహహహ (దగ్గు)
ఆ ప్రహారముగా 
డ్రాములు డ్రమ్ములుగా పెరిగి 
సొమ్ము సారాగా మారగా   

హిక్కడ రామదాసు వసూలైన సొమ్ము 
జమకట్టలేదని 
పైగా గుడికట్టాడని
పసిగట్టిన తానీషా 
ఆయన్ని కటకటాలెనక పెట్టగా 
ఎలా ఏడ్చాడయ్యా 

పేమాతో చేయిస్తి చింతాకు పతకము
సోకంతా నీదాయెనే సీతమ్మతల్లి 
దాసుడికి జైలాయెనే

ఏ తీరుగ నను దయజూసెదవో 
ఏ తీరుగ నను దయజూసెదవో
ఇనకులతిలకా రామా 
అని బోరుబోరుమన్నాడు 

బీరు బీరు 
మందెక్కువైంది 
మందేవదాసు దగ్గర 
సొమ్ము తక్కువైంది 
అప్పుడాయొక్క షాపువాడు  
పైబట్ట లొలిచేసి 
మెడపట్టి గెంటేస్తే 
పైబట్ట లొలిచేసి 
మెడపట్టి గెంటేస్తే
ఏ దారి లేదాయనో
బతుకు గోదారి పాలాయెనో   
దారే గోదారైతే పొరబాటు లేదోయ్ 
ఓడిపోలేదోయ్ 

పంచూడి పోయిందోయ్ 
ఏవిటోయ్ అంత సులభంగా ఊడిపోద్దేటీ 
ఊడిపోలేదోయ్
దోయ్ దోయ్ దోయ్ దోయ్ 
కూకో 

రామదాసుకు తిక్కరేగి 
నమ్ముకున్న రావుణ్ణి 
దుమ్మురేగేలా తిట్టడం మొదలెట్టాడు 
ఎట్టాగయ్యా అనంటే 
నగలనేసుకు కులుకుతాడు 
సీతనొదిలి కదిలిరాడు 
రావణాసుర భీతిరా 
అది రామసెంద్రుని నీతిరా 
ఎవడబ్బ సొమ్మని రామా..! 
ఏయ్ రామయ్యో....!
ఎవడబ్బ సొమ్మని
కులుకుతు తిరిగేవు రామసెంద్రయ్యో 

దేవదాసుకు ఒంటో సారా అంతా ఆవిరై 
చివరాకరికి ఎలాగయ్యాడయ్యా అంటే 
మందులేక నిలవలేను
మందుగొడితే కదలలేను  
మందులేక నిలవలేను
మందుగొడితే కదలలేను
వల్లకాడూ 
వల్లకాడూ కుక్కతోడూ 
చీమూ నెత్తురు లెండెరా
ఈ బొందీ మందుతొ నిండెరా 

రామదాసు రమ్ముదాసులిద్దరూ 
భక్తి తాగి ఒకడు 
మందు తాగి ఒకడు
ఊగారు 
వాగారు 
తిట్టసాగారు 
ఎట్టాగయ్యా అంటే
జతి.. అదీ వరస 

ఉన్నావా 
అసలున్నావా 
ఉంటే కళ్ళు మూసుకున్నావా?
ఎరక్కపోయి మొక్కాను ఇరుక్కుపోయాను 

ఉన్నానా 
బతికున్నానా 
ఉన్నా కన్ను మూసుకున్నానా?
ఎరక్కపోయి తాగాను ఇరుక్కుపోయాను

రామదాసు దేవదాసులనే  
ఇద్దరు దాసుల కథ చెప్పిన 
ఈ హరిదాసు చెప్పిందేంటయ్యా 
చివరాకరికంటే 

భక్తయినా బ్రాందీ అయినా 
లిమిటేషన్ లో ఉంటే ఏటీ  
లిమిటేషన్ లో ఉంటే లిటిగేషనుండదు
కాబట్టి (హార్మనీ అపశృతి)
ఒరే ఆర్మనీ 
అయిపోవచ్చింది నాయనా  
సుతి చూసుకో 
సుతి చేసుకో
కావలిస్తే ఇంకోసారి 

సుతి ఉంటే మడిసే మడిసౌతాడు
మంచోడే ఔతాడు
సుతి తప్పిన మనిషి కరుసౌతాడు
మతిలేనోడౌతాడు (ముక్తాయింపు)
సీ మద్రమారమణ గోవిందో హా.. రి

January 12, 2025

చిట్టెమ్మా చిన్నమ్మా

చిత్రం: అసాధ్యుడు (1968)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపథ్యగానం: పి.బి. శ్రీనివాస్

పల్లవి : 

చిట్టెమ్మా... 
చిన్నమ్మా...
ఒహో చిట్టెమ్మా చిన్నమ్మా 
చూడవమ్మ నన్నూ
ఔనన్నా కాదన్నా 
వీడనమ్మ నిన్ను 
ఒహో చిట్టెమ్మా చిన్నమ్మా 
చూడవమ్మ నన్నూ
ఔనన్నా కాదన్నా 
వీడనమ్మ నిన్ను
ఓ ఓహెూహా బేబీ 
నడిచే గులాబీ

చరణం 1:

ఆ వన్నె సొగసు 
ఆ జున్ను వయసు 
ఆ కన్నెమనసు 
ఔరా... 
ఆ చెంప మెరుపు 
ఆ పెదవి విరుపు 
ఆ కన్ను గెలుపు
ఆ వగైరా వగైరా వగైరా
అమ్మమ్మమ్మ గుండె ఝల్లుమన్నది
చిట్టెమ్మా....

చరణం 2:

ఆ జడల బారు 
ఆ నడక జోరు 
ఆ నడుము తీరు 
ఔరా...
ఆ పైట చెంగు 
ఆ లోని పొంగు 
ఆ మేని రంగు
ఆ వగైరా వగైరా వగైరా
అమ్మమ్మమ్మ గుండె ఝల్లుమన్నది
చిట్టెమ్మా...

చరణం 3:

అందాల నవ్వు 
అందించు నువ్వు 
ఆ పైన సామిరంగా 
ఔరా...
నను చూడు చూడు
జతగూడి చూడు
ఆ పైన చూడు
ఆ వగైరా వగైరా వగైరా
అమ్మమ్మమ్మ గుండె ఝల్లుమన్నది
చిట్టెమ్మా...

November 16, 2024

జీవించు నీ జీవితం

చిత్రం: రేచుక్క (1985)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గాయకులు: సుశీల, బాలు 
సంగీతం: జె.వి.రాఘవులు

పల్లవి :  

జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం 
జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం

తలవంచావా అపజయమే 
ఎదిరించావా విజయం నీదే
భయము జయము చుక్కెదురేరా 

జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం
దీంతనకదిన... 

November 15, 2024

బంగారు వన్నెల

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావ్
రచన: సముద్రాల
గానం: లీల, కోరస్

పల్లవి :  

ఓ.... 
బంగారు వన్నెల రంగారు సంజా - 
రంగేళి ఏతెంచెనే - నా రాజా
చెంగూన రాడాయెనే 
"బంగారు వన్నెల"

నీ నీడలోన నిలిచేనురా

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: సుశీల బృందం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ నీడలోన నిలిచేనురా..ఆ..
యువతీ మనోజా..ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా
నిను కొలిచేనురా..
యువతీ మనోజా
ఏనాటికైనా నీ దానరా..
యువతీ మనోజ
ఏనాటికైనా నీ దానరా రాజా
నవశోభలీను నా మేను 
నీ పూజకేనురా 
యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా - 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీ తీయని కొనగోరుల మీటి
నీ తీయని కొనగోరుల మీటి
మేళవించిన హృదయవిపంచి 
మేళవించిన ప్రేమవిపంచి
మురిసి చిరుగాలి సోకునా 
మొరసి భవదీయగీతమే
వినిచేనే ఈవేళా..
ఏనాటికయినా నీదానరా 
యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జగదీశ్వరా పాహి పరమేశ్వరా...

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు 
రచన: సముద్రాల
గానం: సుశీల, కోరస్

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..
ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..
పాహి సురశేఖరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

ఏరా మనతోటి

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: కొసరాజు
నేపథ్యగానం: మాధవపెద్ధి సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు

పల్లవి : 

ఏరా! - 
ఏరా మనతోటి గెల్చే - 
ధీరులెవ్వరురా! రణశూరులెవ్వరురా!
భళా భళి:
కోరస్: "ఏరా మనతోటి"

అద్దిరభన్న - గుద్దుల బెల్లం - 
గభిగుభిగభిగుభి వీపుకు సున్నం
దుబ్ దుబ్ దుబ్ దూదేకుడూ - 
ఆ దెబ్బతో తోక పీకుడూ

పిలువకురా అలుగకురా

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపథ్యగానం: సుశీల 

పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 
పిలువకురా... 
అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..

పిలువకురా... 
అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా.. 
పలుచన సలుపకురా..

పిలువకురా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 

హాయిహాయిగా ఆమని సాగే

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపథ్యగానం: ఘంటసాల, జిక్కి  

పల్లవి :

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే
హాయిహాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా.. 
హాయి సఖా.. ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే

లీలగా పువులు గాలికి ఊగా ఆ.. ఆ.. ఆ...
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ.....
లీలగా పువులు గాలికి ఊగా
సనిదమ దనిసా 
గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని 
దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ..  
జంపాలగా ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే
Page 1 of 1311234567...131Next »Last