Showing posts with label అనుకోకుండా ఒకరోజు (2005). Show all posts
Showing posts with label అనుకోకుండా ఒకరోజు (2005). Show all posts

ఎవరైనా చూసుంటారా



ఎవరైనా చూసుంటారా
అనుకోకుండా ఒకరోజు (2005)
స్మిత
సిరివెన్నెల
కీరవాణి

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటి గుండెల కోటల్ని

చరణం 1

రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పోంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో
కురిపిస్తాయంటే అంతే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా

చరణం 2

చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కధ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడ తలవంచేలా
మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా