Showing posts with label ఎవరికి వారే యమునా తీరే (1974). Show all posts
Showing posts with label ఎవరికి వారే యమునా తీరే (1974). Show all posts

ఎవరికి వారే యమునా తీరే


ఎవరికి వారే
ఎవరికి వారే యమునా తీరే (1974)
సాహిత్యం:- మైలవరపు గోపి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

పల్లవి

ఎవరికి వారే యమునా తీరే
ఎక్కడో పుడతారు..ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పోతూనే ఉంటారు

చరణం1:

రాజ్యాలను ఏలినారు వేనవేల రాజులు
చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు
కట్టించిన కోటలన్ని మిగిలిపోయెను
కట్టుకున్న మహరాజులు తరలిపోయెను తరలిపోయెను

చరణం2:

ఊపిరి చొరబడితే పుట్టాడంటారు
ఊపిరి నిలబడితే పొయాడంటారు
గాలివాటు బ్రతుకులు..వఠ్ఠి నీటి బుడగలు
నిజమింతే తెలుసుకో...నిజమింతే తెలుసుకో

కలత మరచి నిదురపో...కలత మరచి నిదురపో