Showing posts with label మెరుపుకలలు (1997). Show all posts
Showing posts with label మెరుపుకలలు (1997). Show all posts

వెన్నెలవే వెన్నెలవే


వెన్నెలవే వెన్నెలవే
మెరుపుకలలు (1997)
రెహమాన్
వేటూరి
హరిహరన్

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా

ఊ..లలల్లా ఉహూ..లలల్లా


ఊ..లలల్లా ఉహూ..లలల్లా
చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : శ్రీని, ఉన్నిమీనన్, చిత్ర

ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా
నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా

ఓ వాన పడితే


ఓ వాన పడితే
చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : వాసుదేవన్, సుజాత

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుక్కూక్కు ఎదహోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి
సాగింది నాలో స స రి గ మ ప ద ని స రి
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

అపరంజి మదనుడే


అపరంజి మదనుడే
చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : అనురాధా శ్రీరామ్

అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే
వినువీధిలో ఉంటె సూర్యుడే ఓడునే ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే.. 
పులకింపజేసినాడే