Showing posts with label బొంబాయి ప్రియుడు (1996). Show all posts
Showing posts with label బొంబాయి ప్రియుడు (1996). Show all posts

అహో ప్రియా

అహో ప్రియా
బొంబాయి ప్రియుడు (1996)
చంద్రబోస్
కీరవాణి
బాలు, చిత్ర

అహో ప్రియా.
క్యా బాత్ బోలా చిడియా... మేరా దిల్ పితర్ పితర్ హోగయా..
అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి

అహో ప్రియా.
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిలించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహో అహో అహొ ప్రియా

రాగమంత ఏలుతుందీ అనురాగ మనుపాటకీ
తాళమంటు ఏలుతుందీ పెనవేసుకొను ఆటకీ
మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ
ముద్దు కన్న పెద్దదైన కవిత ఏముందీ
జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ
కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ
అహో అహో అహొ ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా

తీయనైన స్నేహముందీ
విరిసేటి పూలతీగలో
తీరిపోని దాహముంది
తిరిగేటీ తేనెటీగలో
పూల బాల పరిమళాల కబురు పంపిందీ
తేనెటీగ చిలిపి పాట బదులు పలికింది
ఎన్నిసార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది
కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ
అహో అహో అహొ ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిలించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహో అహో అహొ ప్రియా