Showing posts with label ప్రేమికుడు (1994). Show all posts
Showing posts with label ప్రేమికుడు (1994). Show all posts

ఎఱ్ఱాని కుఱ్ఱదాన్ని


ఎఱ్ఱాని కుఱ్ఱదాన్ని
చిత్రం : ప్రేమికుడు (1994)
సంగీతం : ఏ.ఆర్.రహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి

హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
 గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే
పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే
హాయి హాయి హాయి భలే హాయి హాయిలే
ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా
ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే
చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం
అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో

కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళలోన కవ్వింత
మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా
లే లే లే లే లే లే సన్నాయి లే లే లే
అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన
చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే
ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే
అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం

కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

ఓ చెలియా


ఓ చెలియా
చిత్రం: ప్రేమికుడు (1994)
రచన: రాజశ్రీ
సంగీతం: రెహమాన్
గానం: ఉన్ని కృష్ణన్

పల్లవి : 

ఓ చెలియా ..
నా ప్రియసఖియా .. 
చెయ్ జారెను నా మనసే..
ఏ చోటా అది జారినదో 
ఆ జాడే మరిచితినే...
నీ అందెలలో చిక్కుకుంది అని 
నీ పదముల చేరితినే...

ప్రేమంటే ఎన్ని అగచాట్లో 
మన కలయిక తెలిపినదే..
నా గుండెలలో ప్రేమ పరవశమై.. 
ఇరు కన్నులు సోలెనులే..ఏ..
ఓ చెలియా 
నా ప్రియసఖియా 
చెయ్ జారెను నా మనసే...

చరణం 1:

ఈ పూటా చెలి నా మాట  
ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను 
ఏదో అలజడి రేగెనులే...

వీక్షణలో నిరీక్షణలో 
అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు 
మది కలవరమాయెనులే

ఇది స్వర్గమా..నరకమా...
ఏమిటొ తెలియదులే
ఈ జీవికి జీవన మరణము  
నీ చేతిలొ ఉన్నదిలే..ఏ..ఏ...
ఓ చెలియా 

చరణం 2:

కోకిలమ్మా నువు సై అంటే 
నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకుని 
సవరించేను నీ కురులే..

వెన్నెలమ్మా నీకు జోలపాడి 
కాలి మెటికలు విరిచేనే..
వీచేటి చలిగాలులకు 
తెరచాపై నిలిచేనే...

నా ఆశలా ఊసులే 
చెవిలోన చెబుతానే
నీ అడుగులా చెరగని గురుతులే 
ప్రేమచరితలు అంటానే
ఓ చెలియా నా ప్రియసఖియా