Showing posts with label ప్రేమ కానుక (1981). Show all posts
Showing posts with label ప్రేమ కానుక (1981). Show all posts

ఈ కొండకోనల్లో


ఈ కొండకోనల్లో
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి :

ఈ కొండకోనల్లో
నీరెండ ఛాయల్లో
ఈ ఎండి మబ్బుల్లో నీవే
ఈ వాగు వంకల్లో
ఈ ఏటి తరగల్లో
తెల్లాటి నురగల్లో నేనే

వెలుతురు నేనై అహ ఎండవు నీవై
చినుకులు నేనై అహ చిగురులు నీవై
ఎన్నాళ్ళ ఎన్నేళ్ళ సావాసమో హొయ్

చరణం 1:

ఎర్రాని సందెమ్మవో
పచ్చాని చిలకమ్మవో
ఎచ్చన్ని చలిమంటవో
ఎదలోని గుడిగంటవో
రాతిరివో (దూకుడువో)
వలపు జాతరవో (వయసు తాకిడివో)
సందడివో
వయసు (వలపు) పందిరివో
పందిట్లో చిందేసే చిన్నారివో
చిందుల్లో చిన్నారి కన్నయ్యవో
చిగురుకొమ్మ కోకిలమ్మ
పూలరెమ్మ కులుకులమ్మ
ఈ కొమ్మ నా సొమ్మురో
ఈ బొమ్మ పైడమ్మరో

చరణం 2:

నేరేళ్ళ తోటుందిలే
చీకట్ల చాటుందిలే
నీ కళ్ళ తోడుందిలే
నా ఒళ్ళో చోటుందిలే
చిన్నదిలే
నడుము సన్నదిలే
ఉన్నదిలే
ఉడుకుతున్నదిలే
ఉడికించి ఊరించి రమ్మన్నాదే
వచ్చాక నచ్చింది ఇమ్మన్నాడే
విచ్చుకున్న ముద్దుగుమ్మ
మెచ్చుకున్న పిచ్చిదమ్మ
ఈ గుమ్మ సీతమ్మరో
నా సొమ్ము రామయ్యరో

మనసుల ముడి..పెదవుల తడి


మనసుల ముడి..పెదవుల తడి
చిత్రం :  ప్రేమ కానుక (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి... ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..ఏఏ

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి... ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..ఏఏ

చరణం 1 :

లతవై నా జతవై..గతస్మృతువై ..
నా శృతివై..స్వరజతివై..లయగతివై
నను..లాలించవా..ఆ
ఒడివై..చొరవడివై..నా వడివై..
వరవడివై..నా గుడివై..దేవుడివై
నను..పాలించవా..ఆ

వలపు..మెరుపు..మెరిసీ..
మనసు..తలపు..తెరచీ..
సిరిముగ్గులు..వేయించీ..
చిరుదివ్యలు..వెలిగించీ..
తొలిసారి పలికాను పలుకై..
అది నువ్వే అనుకొన్నా..
నీ నవ్వే వెలుగన్నా
నీవు నాతోడు ఉన్నా..ఆహాహాహా..
నేను నీ నీడనన్నా

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి... ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..ఏఏ

చరణం 2 :

చెలివై..నెచ్చెలివై..చిరుచలివై కౌగిలివై
లోగిలిలో..జాబిలివై..నను మురిపించవా..
వరమై..సుందరమై..శుభకరమై..ఆదరమై
సంబరమై..సాగరమై..నను ముంచేయవా..

కనులు కలిపి చూసీ..కలలు నిజము చేసీ
చిరునవ్వులు నవ్వించి..సిరిమువ్వలు మ్రోగించి
తొలిసారి పిలిచాను పిలుపై..

ఆ పిలుపే ఉసిగొలిపి..పరువముతో నను కలిపి
సామగానాలు పాడే..ఆహాహా..సోమపానాలు చేసే

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి... ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..
శతకోటి..రాగాలు..పాడే..