Showing posts with label దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978). Show all posts
Showing posts with label దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978). Show all posts

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?

ఎవరికి ఎవరు
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
ఎస్.రాజేశ్వరరావు
సినారె
రామకృష్ణ, శ్రీమతి రమణ

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?
ముగియని ఈ యాత్రలోనా
ముగిసే ఈ జన్మలోనా?

చరణం 1:

పూలను పెంచే తోటమాలీ
నీవే తోటకు నిప్పులు పెడితే
వెన్నెల కురిసే పున్నమి జాబిలీ
చీకటితో నీవు చేయి కలిపితే
వెన్నెల లేదు-వేకువ లేదు
వెన్నెల లేదు-వేకువ లేదు
ఉదయం లేదు-హృదయం లేదు
బ్రతుకే చేదు

చరణం 2:

దేవుడు వెలసిన కోవెల తానే
వల్లకాడుగా మారిపోతే
గుండెలమాటున నిండుగ వెలిగే
ప్రణయదీపమే ఆరిపోతే
దేవుడు లేడు - జీవుడు లేడు
దేవుడు లేడు - జీవుడు లేడు
వేడుకలేదు-వేదన లేదు
వలపే చేదు