Showing posts with label కొంచెంఇష్టం కొంచెంకష్టం (2009). Show all posts
Showing posts with label కొంచెంఇష్టం కొంచెంకష్టం (2009). Show all posts

అబ్బ...ఛ...



ఝామురేయి వేళల్లో
చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్
సాహిత్యం :  చంద్రబోస్
గానం : మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావ్

పల్లవి: 

అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మమోయ్..
ఝామురేయి వేళల్లో 
వీరుడల్లే వస్తాడు
భామలున్నా వీధుల్లో 
ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో 
హే.. ఆశ రేపుతుంటాడు
కొంచెమైన నమ్మారో 
అంత దోచుకెళ్తాడు
ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే 
మన పడుచు ఎదల కెదురుపడిన 
ముదురు మదనుడు
పోరా పోకిరి రాజా ఆ రాజా..
పోరా దూకుడు రాజా ఏ రాజా..
జా జా వంకరరాజా ఏ రాజా..
పోరా జింకలరాజా రాజా రాజా..
అబ్బ...ఛ....

చరణం 1:

ఎంత పనీ 
పనులొదిలేసి 
సొగసులకేసి గుటకలువేసే 
పెద్ద పనీ..
మా రూపురేఖ పొగిడే 
నీ పెదవికెంత కష్టం
మా చుట్టు తిరిగి అరిగే 
నీ కాళ్ళ కెంత నష్టం
చెవిలోన పువ్వులెట్టు 
చేతివేళ్ళ నొప్పి నరకం
అయినా గానీ 
అలుపే మాని 
మన కులుకు చిలికి 
పులుపు దులుపు చిలిపికృష్ణుడు
పోరా మాయలరాజా ఆ రాజా..
పోరా మర్కటరాజా ఏ రాజా..
సోజా తిమ్మిరిరాజా ఏ రాజా..
పోరా తికమక రాజా రాజా రాజా..
అబ్బ...ఛ.... 

చరణం 2:

కొంటె పనీ 
వలలను వేసీ 
నలుగురిలో మా విలువను పెంచే 
మంచి పనీ
నీ గాలి సోకలేని 
మా మబ్బుకేది వర్షం
నీ వేడి తాకలేని 
మా పసిడి కాదు హారం
నీ కంటి ఘాటు తగలలేని 
ఒంటికేది గర్వం
కనుకే వినుకో 
కబురే అనుకో 
ఇది మగువలెపుడు బయటపడని 
మనసు చప్పుడు
హే రా రా మబ్బులరాజా రాజా..
రా రా రంగులరాజా రాజా..
ఆజా అల్లరిరాజా ఏ రాజా..
రా రా అందరి రాజా..
అబ్బ...ఛ....