Showing posts with label సాహో (2019). Show all posts
Showing posts with label సాహో (2019). Show all posts

నిన్నలు మరిచేలా

నిన్నలు మరిచేలా
చిత్రం: సాహో (2019)
సంగీతం: గురు రంధ్వా 
రచన: కృష్ణకాంత్ 
గానం: హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ 

సాకీ :

ఏ చోట నువ్వున్నా
ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం
లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే
నాకేమైన బాగుంటా
ధూరాల దారుల్లో
నీవెంట నేనుంటా
నన్నిలా నీలోన దాచేసా

పల్లవి:

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

చరణం 1:

ఈన్నాళ్ళ నా మౌనం
వీడాలి నీ కోసం
కలిసొచ్హే నీ కాలం
దొరికింది నీ స్నేహం
నాదన్న ఆసాంతం
చెస్తాను నీ సొంతం
రాదింక ఏ ధూరం
నాకుంటే నీ సాయం
నన్నిలా నీలోన దాచేసా

రెప్పలు మూసున్న
నే నిన్నె చూస్తారా
ఎప్పటికి నిన్నే
నాలో దాస్తారా

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

సయ్యా సైకో

సయ్యా సైకో
చిత్రం: సాహో (2019)
సంగీతం: తనిష్క్ బాగ్చి
రచన: శ్రీజో
గానం: ధ్వని భానుశాలి, అనిరుద్ రవిచంద్రన్

తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే
తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే

పగలే నీకు చుక్కలు ఇన్ ద స్కై
రేయంత మింగే నిదురని కలలై
నషే మే నన్ను ముంచిక.. డోంట్ బీ షై
ఆశే మన మనసులో వైకో వైకో
ఎదురు పడె కళ్లతో మెస్మరైజ్
వల్లనే నీతోనే నీచే కీ హై

ఓ చురా కైసే దిల్ కో తుఫాయే ఫ్లై
ఆజా నువ్వు నేను చల్ జైకో జైకో
ఓ సయ్యా సయ్యా వే
నా సరసకి సయ్యా వే
నీ చూపులే వెయ్య గుండెని కొయ్య
దిల్ జరా కాస్కో కాస్కో
ఆగడిక సయ్యా సైకో

ఆగడిక సయ్యా సైకో
తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే
తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే

తలకిందులు చేసే మాయేదో
చూపించావే నీ మాటల్లో
తలకిందులు చేసే మాయేదో
చూపించావే నీ మాటల్లో
కంగారు ఎందుకు.. లెట్స్ టేక్ ఇట్ స్లో
నిజమేనా ఈ కలలు
ఓ సయ్యా సయ్యా రే
నీకోసం తయ్యారే
నీకెప్పుడో ఎర వేశా
వదలను నిన్నే మన కథ
రాస్కో రాస్కో
ఆగడిక సయ్యా సైకో

కలిసుంటే

కలిసుంటే
చిత్రం : సాహో (2019)
సంగీతం : శంకర్ ఎహ్సాన్ లాయ్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : శంకర్ మహదేవన్,
శ్వేతా మోహన్, సిద్దార్థ్ మహదేవన్

కలిసుంటే నీతో ఇలా
కలలానే తోచిందిగా
తలవంచి ఆకాశమే
నిలిచుందా నాకోసమే

కరిగిందా ఆ దూరమే
వదిలెళ్ళా నా నేరమే
నమ్మింక నన్నే ఇలా
తీరుస్తా నీ ప్రతి కల

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

నీకంటూ సరిపోనని
అనుకున్నా రావద్దనీ
అటుపైనే తెలిసిందిలే
నేనుందే నీలో అనీ

విడదీసే సందేహమే
వదిలేస్తే సంతోషమే
కాలాలే కలిపాయిలే
కోపాలే కాలాయిలే

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

 (Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

  ఇంతింత దూరాలే చేరి
పంతాలు వీడాలి మనసే
నిజమేమిటో
తెలియదా అదే క్షణం

నిద్దరలో లేకున్నా కల
నేడొచ్చి నీ కళ్ళు చేరేలా
చూపించనా
ఆనాటి గురుతులే

నీతో లేకున్నా నీలో ఉన్నాలే
నీకొచ్చే కలలన్నీ నేనూ కన్నాలే
నీచేతి బొమ్మే గీతల్ని దాటి ప్రాణమొచ్చి
నీ కళ్ళముందుంది చూడవా

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||