Showing posts with label అమెరికా అల్లుడు (1985). Show all posts
Showing posts with label అమెరికా అల్లుడు (1985). Show all posts

నా వాలుజడ కృష్ణవేణి



నా వాలుజడ కృష్ణవేణి
చిత్రం : అమెరికా అల్లుడు (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

నా వాలుజడ కృష్ణవేణి..
నా పూలజడ వెన్నెలా గోదారి
నా ఒళ్ళు గంగమ్మ పరవళ్లుగా...
నా ఒళ్ళు గంగమ్మ పరవళ్లుగా...
నర్తన చేసిన రతిని... భారతిని
కూచిపూడి భారతికి హారతిని..
భారతిని....ఈ...ఈ..
నా వాలుజడ కృష్ణవేణి..
నా పూలజడ వెన్నెలా గోదారి

చరణం 1 :

ఏ జన్మలో మల్లెపూపూజ చేశానో
కుందరదనైనాను
ఏనాటి కార్తీక దీపాల వెలుగో..
ఇందువదననైనాను
అమరావతి బౌద్ధ ఆరామశిల్పాల
వైరాగ్య భావాల దీకావిరంగు..
ఈ చీర చెంగు
మమత.. సమత.. మతమై
వెలసిన మధుర భారతి వీణను..
నెరజాణను నేను

నా వాలుజడ కృష్ణవేణి..
నా పూలజడ వెన్నెల గోదారి

చరణం 2 :

ఈ నాల్గు వేదాల పాఠాలు విన్నానో..
హంసగమననైనాను
ఏ నాసికత్వాల వాదాలు విన్నానో..
గగన జఘననైనాను
క్షేత్రయ్య పదకీర్తనావేశ నాట్యాల
రాజ్యాలలో చిందు నా కాలి చిందు..
మీ కళ్ళవిందు
శృతికి.. లయకి.. సుతనై
పుట్టిన మధుర భారతి వీణను..
నెరజాణను నేను

నా వాలుజడ కృష్ణవేణి..
నా పూలజడ వెన్నెల గోదారి
నా ఒళ్ళు గంగమ్మ పరవళ్లుగా...
నా ఒళ్ళు గంగమ్మ పరవళ్లుగా...
నర్తన చేసిన రతిని... భారతిని
కూచిపూడి భారతికి హారతిని..
భారతిని....ఈ...ఈ..
నా వాలుజడ కృష్ణవేణి..
నా పూలజడ వెన్నెల గోదారి