చిత్రం: పల్నాటి పౌరుషం (1994)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: డి. నారాయణవర్మ
గానం: మనో, టి.కె.కళా, సునంద
పల్లవి:
ఇదిగో పెద్దాపురం
ఎదురుగుంది పిఠాపురం
పూటకో పేటజాణ కాపురం
మీసకట్టు రాకుండా
పంచెకట్టు తెలియకుండా
రోజుకో కన్నెరికం చేసాను
అరే పెళ్ళన్న వాడి నోరుమూసాను
ఇదిగో పెద్దాపురం
చరణం 1:
రాలుగాయి మాటలతో
ఆకురాయి చూపులతో
సవర్తాడ చేసి నన్ను తెచ్చావు
సారెచీరె పట్టుకుని కాపురానికెళుతుంటే
దారికాసి నన్ను లేపుకొచ్చావు
హయ్ కొత్తపేట సంతలోనా
కోనయిసు చేతబట్టి
చిత్తకార్తె కుక్కలాగా పట్టావు
చేతగాని నా మొగుడనుమానానికి తాళమెయ్యా
మారుతాళమెట్టి పెట్టి తెరిచావు
అయ్
ఆలి లేదు చూలు లేదు
జంఝాటం లేనేలేదు
ముప్పొద్దూ ముద్దులాడుకుందామా
వారానికి రోజులేదూ
ఉన్నదేమో నలుగురాయే
ఎక్కడమ్మా తక్కువైన ముగ్గురూ
ఇదిగో పెద్దాపురం
చరణం 2:
వా(మ)నగుంటలాటలోనా
తొక్కుడుబిళ్ళ ఈతలోనా
ఢక్కామొక్కీ తిన్నాను బావయ్యో
ఆహా
నా అందం పందిరిమంచం
నా పరువం పట్టుపరుపూ
ఝాముకొక్క నోము తీర్చరావయ్యో
హే
కోకడాబు కాదు నాది కొలతల్లో అందమదీ
జారుముళ్ళ సోకుమళ్ళు నావయ్యో
ఆయ్
గుడిమీద భంగిమలు గదిలోన చూపిస్తా
కామసూత్ర జాణ నేను కావయ్యో
అరెరెరె
పువ్వుకో వాసనుంది
పండుకో రుచి ఉంది
పిల్లకో సుఖముంది పొందగా
గంటకో గంటకొట్టే
నిత్యపెళ్లికొడుకులాగా
శతకోటి శోభనాల పండగ
ఇదిగో పెద్దాపురం
No comments:
Post a Comment
Leave your comments