August 31, 2023

మా కంటి జాబిలీ...

మా కంటి జాబిలీ... 
చిత్రం: మకుటంలేని మహారాజు(1986)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: రాజ్ సీతారామన్, సుశీల

పల్లవి :

మా కంటి జాబిలీ... 
మా ఇంటి వెన్నెలా...  
వెళ్ళిరా చల్లగా అత్తింటికి 
వెళ్ళిరా చల్లగా అత్తింటికి 
కడలింటికెళ్ళేటి కృష్ణవేణమ్మలా (కడలి ఇంటికి)
పాటతో దీవించె కొమ్మలో కోయిల
మా కంటి జాబిలీ 
మా ఇంటి వెన్నెలా 

August 7, 2023

ఒళ్ళే పూతరేకు

ఒళ్ళే పూతరేకు 
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: వేటూరి
గానం: చిత్ర, బాలు 

పల్లవి: 

ఒళ్ళే పూతరేకు 
వాటేసుకుంటే సోకు 

ఆమ్మో అంటుకోకు 
అబ్బ రాలుతుంది రేకు 

విచ్చే వేళలో 

ఇచ్చే ఠీవిలో 

మొగలిపూల మగ యవ్వనం 

పగలే కోరే సొగసే దినం 

తనువందించే తాంబూలంలో 
ఒళ్ళే పూతరేకు 
వాటేసుకుంటే సోకు 

ఆమ్మో అంటుకోకూ 

ఓ ప్రియా ప్రియా ప్రియా

ఓ ప్రియా ప్రియా ప్రియా
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: భువనచంద్ర
గానం: చిత్ర, బాలు 

పల్లవి:

ఓ ప్రియా ప్రియా ప్రియా

దిల్ దియా దియా దియా

కన్నెసిగ్గు బరువాయే 
కంటినిద్ర కరువాయే 

పిచ్చిప్రేమ రెచ్చిపోయే 
తెల్లవార్లు జాతరాయే 

ఓ ప్రియా ప్రియా ప్రియా

దిల్ దియా దియా దియా

August 6, 2023

ఇది స్వాతి జల్లు

ఇది స్వాతి జల్లు
జమదగ్ని (1988)
సంగీతం: ఇళయరాజా 
గానం: జానకి, మనో 
రచన: సాహితి 
 
పల్లవి: 

ఇది స్వాతి జల్లు 
ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు 
వాటేసి వెళ్ళు
పెళ్ళాడే వాడా 
పెనవేసే తోడా

ఇది స్వాతి జల్లు 
ఒణికింది ఒళ్ళు
నీ నీలి కళ్ళు 
అవునంటె చాలు
అల్లాడే దానా 
అలవాటైపోనా..

ఇది స్వాతి జల్లు

భద్రం కొడుకో

భద్రం కొడుకో 
రంగుల కల (1983)
సంగీతం: నరసింగరావు 
గానం: గద్దర్ 

భద్రం కొడుకో 
నా కొడుకో కొమరన్న జరా 
పైలం కొడుకో
నా కొడుకో కొమరన్న జరా 

రిక్షా ఎక్కేకాడ దిగేకాడ 
తొక్కుడు కాడ మలుపుకాడ 

మన ఊరు గాని ఊరు 
మన పల్లె గాని పల్లె 
ఇది పట్నం కొడుకో

ఈడొచ్చి పడ్డాది

ఈడొచ్చి పడ్డాది 
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: భువనచంద్ర
గానం: చిత్ర, బాలు 

పల్లవి:

ఈడొచ్చి పడ్డాది ఒడిలోనా.... 
ఎన్నీయల్లో ....

తోడొచ్చి తొంగుంట పిల్లదానా.... 
ఎన్నీయల్లో....

అడ్డుకుంది మోమాటం 
ముడి విప్పమంది ఆరాటం
 
గోడమీది పిల్లివాటం 
ఇక చాలు చాలు బుల్లో 
చేరనీవే ఒళ్ళో

August 3, 2023

గుడి గంటలే జయమంటు

గుడి గంటలే  జయమంటు
రేపల్లెలో రాధ (2001)
సంగీతం: కోటి
గానం: స్వర్ణలత

పల్లవి:

గుడి గంటలే జయమంటు శుభమంటు మోగేనులే
జడ గంటలే జగమంత నాదంటు ఊగేనులే
పైరు పరవళ్ళు... ఏరు ఉరవళ్ళు
నింగి పందిళ్ళు... నేల సందెళ్ళు

గుడి గంటలే జయమంటు శుభమంటు మోగేనులే

August 1, 2023

ఇది రాగమైనా అనురాగమే

ఇది రాగమైనా 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: బాలు, చిత్ర

పల్లవి:

ఇది రాగమైనా అనురాగమే 
తొలి అనుభవ గీతమిదే
ఇది రాగమైనా అనురాగమే
కన్నులే ఎద జల్లగా...
కాటుకే హరివిల్లుగా 
జత పడిన మనకు శృతి కలిసెనిపుడు 
ప్రియతమా మధుర లయే కదా మనుగడ

ఇది రాగమైనా అనురాగమే 
తొలి అనుభవ గీతమిదే

ఇది రాగమైనా అనురాగమే 

ఎద నట్టింటను మెట్టిందొక

ఎద నట్టింటను మెట్టిందొక
ప్రార్థన (1991)
రచన: సిరివెన్నెల
సంగీతం: దేవేంద్రన్ 
గానం: బాలు, జానకి 

పల్లవి:

ఎద నట్టింటను మెట్టిందొక మధు కథ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ  
రూపెత్తిన ఆనందం ఆగేనా?

ఎద నట్టింటను మెట్టిందొక మధు కథ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ  
రూపెత్తిన ఆనందం ఆగేనా?

దివి లక్షింతల అక్షింతలు కురియగ
నిద్రించని విద్యుల్లత విరియగ 
చేపట్టిన వాసంతం వాడేనా?

శుభమూర్తం పిలిచింది 
సురద్వారం తెరిచింది 
నవరాగం రాగా

ఎద నట్టింటను మెట్టిందొక మధు కథ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ  
రూపెత్తిన ఆనందం ఆగేనా?