January 9, 2021

లేడీస్ టైలర్ టైటిల్ సాంగ్


లేడీస్ టైలర్ టైటిల్ సాంగ్ 
లేడీస్ టైలర్ (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
మాటలు: తనికెళ్ళ భరణి  
గానం: బాలు
గాత్రధారులు: రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, వై.విజయ, మల్లికార్జున రావు. 

సూర్యుడు సూదులెట్టి పొడుత్తున్నాడు.. లేద్దూ..
వెంకటరత్నంగారి కోడి కూతేసేసింది.. లేద్దూ..
 
హైలేస్సా హైలేసా.. 
హైలేస్సా హైలేసా.. 

జాలరోళ్ళు అప్పుడే గోదాట్లోకెళ్ళిపోతున్నారు.. 
లెమ్మంటుంటే...
బంగారంలాంటి విద్య చేతిలో పెట్టుకునీ..
ఈ బద్దకవేవిటి
కుంభకర్ణుడిలా ఆ నిద్దరేవిటీ...
అయ్యో...ఇలా అయితే నువ్ పనికి రావ్... 
చేతిలో ఉన్న విద్యని ఉపయోగించాలి..
ఛీ.. నీలాంటి వాడి దగ్గర పనిచేయడం నా బుద్దితక్కువ
అబ్బా....
ఇంత పొడుగుందేంటి కాలూ...
ఆ...అ...అబ్బా...
ఆ...ఇదంతా నిజమే...! 

వేటాడందే ఒళ్ళోకొచ్చి చేప చేరదు
రెక్కాడందే గూటిలోకి కూడు చేరదు
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తీయదు
గింజా గింజా ఏరకుంటే పూట తీరదు

ఓ గురువా... సోమరిగా ఉంటే ఎలా
బద్దకమే ఈ జన్మకు వదిలిపోదా
గురకలలో నీ బతుకే చెడును కదా
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా

లేవర లేవర.. 
అబ్బా పోరా..
సుందర సుందర.. 
తంతానొరేయ్.. 
చాలును నిద్దర..
థూ... 
ఈ సారి నిద్దర లేపావంటే సంపేత్తానొరేయ్
ఆ...

గోదారమ్మో సల్లంగా దారి సూపవే
చల్లని తల్లీ నీ పాపల కాపు కాయవే
వయ్యారంగా మా పడవల ఊయలూపవే
హైలెస్సా హుషారుగా బతుకు నడపవే
కోటిపల్లి, కూనవరం ఏ రేవైనా
గెడను నెట్టి తెరలు కట్టి సేరేమమ్మా
అద్దరికి ఇద్దరికీ ఈ మజ్జిన
ఏ పొద్దూ బద్దకమే ఉండదమ్మా
ఎయ్యర ఎయ్యర
జోరుగ జోరుగ
హైలెస్స హైలెస్స హైలెస్స

థూ... మీ పడవలూ, పాటలూ తగలెయ్యా
పొద్దున్నే నిద్ర చెడగొట్టేసారు కదరా... 

తెల్లారితే అల్లీబిల్లీ అల్లరాటకు
చలాకీగ తుళ్ళిపడే ఈతలాటకు
ఒప్పులకుప్పా చకాచకా చిందులెయ్యవే
కిందా మీదా చూడకుండ మొగ్గలెయ్యరా

ఆటలలో పాటలలో విసుగులేదు
ఆయాసం మాకెపుడూ అడ్డేరాదు
సోంబేరికి ఈ వరమే ఎప్పుడు రాదూ
మొద్దులతో సావాసం మాకు వద్దు

చెమ్మా చెక్కా.. 
సిందులు మానండెహె..
చూడర గొప్పా.. 
సప్పుడు చేయకండెహె..
వెయ్యర మొగ్గ
థూ.. 
రేయ్ నా నిద్దర సెడగొట్టొద్దన్నానా

ఎర్రబడే తూరుపు మందార మొగ్గలు
నవ్వులతో ముంగిట ముత్యాలముగ్గులు
చెట్టూ చేమా పూచే ఈ వెలుగు పువ్వులు
కిలకిలా తుళ్ళిపడే కాంతి నవ్వులు
చెమటలలో తళుకుమనే చురుకుదనం
కండలలో పొంగిన బంగారు బలం
పాటడితే దొరికినదే అసలు సుఖం
సోమరులకు తెలియనిదీ తీపి నిజం

తియ్యర తియ్యర
తొందర సెయ్యర
పనిలో...
తియ్యర తియ్యర
తియ్యర తియ్యర

ఇదిగో నాగమణి నీ ఒంటి రంగుకీ.. 
ఈ రంగు బట్ట జాకెట్టు కుట్టించుకున్నావనుకో.. 
ప్చ్... అచ్చం అమ్మోరులాగుంటావ్...

ఆ... నేను అమ్మవారిలాగుంటే 
నువ్ పోతురాజులాగుంటావ్...
నాకొద్దు ఫో...

ఇదిగిదిగిదిగిదిగో..ప్చ్...
బట్ట నాణెం చూడకుండా నువ్ 
కాదనేయకూడదు... 
రెండు గజాలైతే మూడు జాకెట్లవుతాయ్...

ఆ...క్రితంసారి మూడుగజాలు కొని తడిపితే...
ఒక్క జాకెట్టయ్యింది... 

ఇదిగో నా గజం బద్దమీదొట్టు... 
ఈ సారలా జరిగితే చెప్పిచ్చుక్కొట్టు 
మొన్న నాయుడి గారింట్లో పెళ్ళయితే 
అరవై గజాలిచ్చాను తెలుసునా...

జాకిట్లకే...?
లేక తలుపులకీ ద్వారబంధాలకి కట్టారా...?

ఛాఛా..

ఇదిగో సత్యం...కొనూ కొనూ అని నా పేణాలు తీత్తావ్ 
తీరా కొంటే... ఏ కాకినాడో రాజమండ్రో ఎల్లి కుట్టిచ్చుకోవాలి 
ఇక్కడ సరిగ్గా కుట్టే సచ్చినోడేడీ...?

అదేటీ... మన సుందరంగాడున్నాడుగా! 

ఎవడూ...సుందరవా...?
ఆ...ఆడి సేతికిస్తే బట్టమీద ఆశొదులుకోవలిసిందే
సచ్చినోడు.
 
కుట్టడం బాగానే కుడతాడు 
కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం 
లేపోతే ఫస్ట్ క్లాసైన టైలరయిపోవాల్సినోడు కదా...

ఆడూ వద్దు... నువ్వూ వద్దు 
అంతగా ఐతే... నేను రవికలేసుకోడమే మానేత్తాను.

ఆ... అమ్మబాబోయ్ అంత మాటని నా పొట్ట కొట్టక... 
ఆ సుందరాన్నొప్పించి నీ రవిక కుట్టించే పూచీ నాది. సరేనా...?

అయితే జాకెట్టు కుట్టి పట్టుకొచ్చేకే డబ్బిస్తాను...పో...