నీ నుదుట కుంకుమ
చిత్రం: దేవాలయం (1985)
గానం: సుశీల బృందం
రచన: సినారె
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
నీ నుదుట కుంకుమ నిత్యమై వెలగాలి
నూరేళ్ళ జీవితం నవ్వుతూ సాగాలి
ఎంత చక్కనిదమ్మా మా ముద్దుగుమ్మా
ఏడూ మల్లెల ఎత్తు బంగారుబొమ్మ...
నీ నుదుట కుంకుమ నిత్యమై వెలగాలి
చరణం 1:
పెళ్లిపందిరి లోన చిట్టీ చిలకమ్మా
పసుపు పారాణితో మెరిసేటి కొమ్మా
కల్లాకపటం లేని మగడు నీకు దొరికాడు
గుండెనే గుడి చేసి నిన్ను దాచుకుంటాడు
చరణం 2:
ఆరళ్ళు లేనట్టి అత్తవారింట
ముత్తైదువై ముద్దుమురిపాల తేలాలి
అపురూపమైనట్టి అయిదోతనమ్ము
ఆభరణమై నీకు అందాలు తేవాలి
చరణం 3:
పరువాల వేళలో సిగ్గూ పడకమ్మా
ప్రతి రేయీ కావాలి తొలిరేయి నీకు
మూడుపూ కట్టిన వలపు చెల్లించవమ్మా
పండంటి పసిపాప ఈ ఇంట నడవాలి