నీ కన్నులలో నా కన్నీరే
ఆమె ఎవరు? (1966)
సంగీతం: వేద
గానం: సుశీల
రచన: దాశరథి
పల్లవి:
నీ కన్నులలో నా కన్నీరే వింతగా
పొంగి రానేలా...
ఇంతలో మారిపోయే లోకమంటే
అంత మమతేలా...
గడియలో మాసిపోయే బ్రతుకుకోసం
కంట నీరేలా?...
చరణం 1:
కలనుగానీ ఇలనుగానీ
నిన్నే తలచుకుంటాను
నేడుగానీ రేపుగానీ
ఎన్నడూ మరచిపోలేను
నీడలాగా గాలిలాగా నీలో
నిలచిపోతాను
చరణం 2:
బాధనాది బరువునాది
ఇంతగా చింత నీకేలా?
లేనిపోని భ్రాంతి బూని
బెంగతో కృంగిపోనేలా?
రాలిపోయే వాడిపోయే
పూలపై మోజు నీకేలా?
చరణం 3:
ఎడదలోని కడలిలోనా
లోకమే మునిగిపోయేను
దారిలేని నావలాగా
ఎచటికో సాగిపోతాను
సాగిపోతూ నిన్నుచూచి
ఎందుకో ఆగిపోతాను