January 6, 2021

కలువనే కోరి వలచె



కలువనే కోరి వలచె
ఇదా ప్రపంచం (1987)
వెన్నెలకంటి
చక్రవర్తి
బాలు, సుశీల

పల్లవి: 

కలువనే కోరి వలచె నెలవంక..
చిలుకనే చేరుకుంది గోరింక
ఆ బంధమే.... 
మధురానందమై 
మనసున విరిసెను మమతలు మల్లెలుగా 

విరిసెలే మదిని మరుల మధుమాసం 
కురిసెలే వలపు విరులు మనకోసం 
నీ పాటలే... 
సిరులా తోటలై 
పులకలు పూలై పూచిన పున్నమిలా  

చరణం 1: 

సాగే పరవశాన మౌనవీణ 
మధుర రాగాలాపన..ఆ 

మ్రోగే వెదురు నేడు వేణువైన 
మదిని ప్రేమారాధనా... 

జతులే సరసతలై 

జతలో సంగతులై 

శృంగారమే సంగీతమై 
శృతులై లయలై పలికిన గమకంలో 

చరణం 2:

వయసే రెక్కవిసిరి నింగిలోన 
రివ్వుమంది గువ్వలా....

మనసే రేకువిరిసి రేపు నాదని 
నవ్వుకుంది పువ్వులా....

వేచిన ఆమనిలో 

పూచిన పున్నమిలో 

ఈ రేయిలో ఏ కోయిలో 
పలికే ఎదలో చిగురుల ఊయలలో