బండెల్లి పోతందె
ఇదా ప్రపంచం (1987)
రచన: జాలాది రాజారావు
సంగీతం: చక్రవర్తి
గానం: వందేమాతరం శ్రీనివాస్, మనో, లలిత సాగరి
పల్లవి:
బండెల్లి పోతందె సెల్లెలా....
బతుకు బండెల్లి పోతందె సెల్లెలా...
బండెల్లి పోతందె సెల్లెలా
బతుకు బండెల్లి పోతందె సెల్లెలా
గతుకుబితుకులేక బతకనేర్చిన బండి
శతపోరు పెడతంది సెల్లెలా
బండెల్లి పోతందోరన్నయ్యా....
బతుకు బండెల్లి పోతందోరన్నయ్యా..హో
బండెల్లి పోతందోరన్నయ్యో
బతుకు బండెల్లి పోతందోరన్నయ్యా..
ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోటి
బతుకెల్లి పోతందోరన్నయ్యా
చరణం 1:
దొరలెక్కే డబ్బీలో పరుపులు
అల్ల పేదోళ్ళ బతుకంత బరువులు
పరువే బరువైపోతే సెల్లెలా
దాన్ని కూలోడే మొయ్యాలె సెల్లెలా
దరమమడిగావంటే సెల్లెలా...
మన ఖర్మాన తిడతారే సెల్లెలా...
పేదోళ్ళ డబ్బీలో సెల్లెలా...
ఇంత ఆదరణ దొరికేనె సెల్లెలా...
చరణం 2:
కష్టాల పట్టాల మెలికలు
మనిషి గుండెల్లో సెగపుట్టే పరుగులు
పెట్టెల్లో జనమేమో కిటకిట
ముద్ద పెట్టే దిక్కేలేక కటకట
టేషన్లెన్ని మారిపోయినా....
బండి ఏ దేశానికెళ్ళి ఆగినా...ఓ...
పట్టాల మార్పేలే సెల్లెలా
మన పొట్టయినా నిండాదె సెల్లెలా
చరణం 3:
కిటికీలో కనిపించే కాలము
అల్ల గిరగిర తిరిగే భూగోళము
ఏడకి బోతాందో తెలవదు
బండి గుండెల్లో బరువేమో తరగదు
బుక్కింగులో పుట్టి వచ్చినా
తల్లి టిక్కెట్టు నీచేతికిచ్చినా...
ఊరు పేరు రాసే ఉంటది
బతుకు దూరమెంతో ఏసి ఉంటది
చరణం 4:
పుట్టేటప్పుడు కొన్న టిక్కెట్టు
నిన్ను మోసేటప్పుడు కాస్త చూపెట్టు
పదుగురితో పరుగెత్తే పయనము
కడకు నలుగురితో నడిచెళ్ళే దూరము
జెండాలు రెండేనే సెల్లెలా
జెండాలు రెండేనే సెల్లెలా
అయ్యి సావుపుట్టకలంట సెల్లెలా
సిగినలిచ్చేవాడు దేవుడు
బండి దిగి ఎల్లిపొయ్యోడు జీవుడు
సిగినలిచ్చేవాడు దేవుడు
బండి దిగి ఎల్లిపొయ్యోడు జీవుడు