Showing posts with label శ్రీ వెంకటేశ్వర వైభవం (1971). Show all posts
Showing posts with label శ్రీ వెంకటేశ్వర వైభవం (1971). Show all posts

ఒక పిలుపులో పిలిచితే


ఒక పిలుపులో పిలిచితే
చిత్రం: శ్రీ వెంకటేశ్వర వైభవం (1971)
గాయని: శ్రీరంగం గోపాలరత్నం
రచన: ఏడిద కామేశ్వరరావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా . .
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా
నా పలుకులో కులుకుతావటా . . ఓ . .
ఆపదమ్రొక్కుల స్వామీ
నీ సన్నిధె నా పెన్నిధీ. .
నీ సన్నిధె నా పెన్నిధీ. .

ఏడుకొండల శ్రీనివాసా


ఏడుకొండల శ్రీనివాసా
చిత్రం: శ్రీ వెంకటేశ్వర వైభవం (1971)
సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల గారు

పల్లవి::

ఏడుకొండల శ్రీనివాసా..ఆఆఅ
ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా
ఏడేడు జన్మల పాపముల..ఎడబాపి బ్రోచే వేంకటేశా..ఆ

చరణం::1

కోటికీ పడగెత్తినా..ధనవంతుడూ
కోటికీ పడగెత్తినా..ధనవంతుడూ
నీ గుడి ముంగిటా..సామాన్యుడూ
కూటి కోసం శ్రమపడే..నిర్భాగ్యుడూ
కూటి కోసం శ్రమపడే..నిర్భాగ్యుడూ
నీ కృపకెప్పుడూ..సమపాత్రుడూ..ఊఊ

చరణం::2

మమకారాలూ..ఉండరాదనీ
మా తలనీలాలూ..తీసుకొందువూ
నీది నాదని...ఏది లేదని
నిలువు దోపిడి..వొలుచుకొందువూ
వెళ్ళునపుడూ..వెంటరాదని
ముడుపులన్నీ..ఊడ్చుకుందువూ
అడుగడుగునా..అడుగడుగునా
వేదాంతమున్నది..నీ ఆరాధనలో సాధనున్నదీ
ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేశా

చరణం::3

ఆ శేతు శీతాచలము నీవే దైవమూ..ఆ ఆ ఆ ఆ
ఆ బాల గోపాలమ్ము నిన్నే కొల్తుమూ..ఆ ఆ ఆ ఆ
నీ దివ్య మంగళ రూపమూ..ఆ ఆ ఆ ఆ
మా నిత్య దర్శన తేజమూ..ఆ ఆ ఆ ఆ
నీ పాద పద్మ యుగళమూ..ఆ ఆ ఆ ఆ
సంసార సాగర...తరణమూ
ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేశా