Showing posts with label శశిరేఖా పరిణయం (2008). Show all posts
Showing posts with label శశిరేఖా పరిణయం (2008). Show all posts

ఏదో.... ఒప్పుకోనంది నా ప్రాణం..

ఏదో.... ఒప్పుకోనంది నా ప్రాణం..
శశిరేఖా పరిణయం (2008)
సిరివెన్నెల
విద్యాసాగర్
సైంధవి

ఏదో.... ఒప్పుకోనంది నా ప్రాణం..
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం
కలత పడుతోందే లోలోన..
కసురుకుంటోందే నా పైనా
తన గుబులు నేనూ..నా దిగులు తానూ
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం..
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం

చరణం 1:

పచ్చగా ఉన్నా పూదోట..
నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా..
గిచ్చినట్టుందే నన్నంతా
పచ్చగా ఉన్నా పూదోట..
నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా..
గిచ్చినట్టుందే నన్నంతా
ఉండలేను నెమ్మదిగా..
ఎందుకంట తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా..
ఎందుకంట తెలియదుగా
తప్పటడుగో తప్పు అనుకో..
తప్పదే తప్పుకుపోదాం
తక్షణం అంటూ..
అడ్డుపడుతోంది ఆరాటం..
పదమంటూ.... నెట్టుకెళ్తోంది నను సైతం..