Showing posts with label విమల (1960). Show all posts

నీలివెన్నెల కాయసాగే

నీలివెన్నెల కాయసాగే
చిత్రం :  విమల (1960)
సంగీతం :  ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు
గీతరచయిత :  ముద్దుకృష్ణ
నేపధ్య గానం :  జయలక్ష్మి

పల్లవి :

నీలివెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే
నీలీ వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే

నాలో కలలు చెలరేగే నను గనవిదేరా.. ప్రేమ .. మీరా

చరణం 1 :

గుండె దడ దడలు మీరి... నిన్నే నిండు మనసునను కోరి

కన్ను తళుకులకు నన్నే మరిచినాను  కదరా.. మది .. చెదరా
కన్ను తళుకులకు నన్నే మరిచినాను  కదరా.. మది .. చెదరా

నీలివెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే

చరణం 2 :

చక్కదనము సొమ్ము నేనే.. నీకే చిక్కి సమస్తమమ్మినానే

ఒక్క పలుకుతోనే.. చిక్కు తీరునురా
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ...నా దిక్కే  చూడవేరా ..
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ.. నా దిక్కే  చూడవేరా ..

చరణం 3 :

మనసు మనసు పెనవేసి.. మన మమతలొకటిగను  చేసి
మనసు మనసు పెనవేసి.. మన మమతలొకటిగను  చేసి

కలలు కనిన మన వలపు ఫలములను కనరా .. సుఖమగురా