గొడవే గొడవమ్మా
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: బాలు, చిత్ర
పల్లవి:
గొడవే గొడవమ్మా చేయిపట్టే చిలిపివాడమ్మా...
గొడవే లేదమ్మా దారిపట్టి పొదకే పదవమ్మా...
అడుగు అడిగేదడుగు...
వయసే మిడిసిపడుతుంటే...
తళుకే సుడులే తిరిగి
ఒరిగి ఒదిగిపోతుంటే...
తడిసి బెడిసి మెరిసే సొగసు ఒడిసిపడుతు
గొడవే గొడవమ్మా చేయిపట్టే చిలిపివాడమ్మా...
గొడవే లేదమ్మా దారిపట్టి పొదకే పదవమ్మా...
చరణం 1:
మొదటే చలిగాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంపతెంచే
అసలే నీ ఒంపు నా కొంపముంచే
ముదిరే వలుపుల్లో నిదరే సెలవంటా
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కథలే నే వింటా
అదిరే గుండెలో శృతులే ముద్దంటా
దోబూచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది
పగతో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిసి జరిగే ప్రణయం
గొడవే గొడవమ్మా చేయిపట్టే చిలిపివాడమ్మా...
చరణం 2:
ఇపుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్న ఈ నైటుబీటు
ఎపుడో మార్చింది నా హార్టుబీటు
పిలిచే వయసుల్తో జరిగే పేరంటం
మొలిచే సొగసుల్తో పెరిగే ఆరాటం
చలికే వొళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దుల్లో కరిగే సాయంత్రం
నీ ఎడారి నిండా ఉదకమండలాలు
నీటి ధార దాటే మౌనపంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం
గొడవే గొడవమ్మా చేయిపట్టే చిలిపివాడమ్మా...