తెలంగాణా జానపదం
సాహిత్యం: శ్రీలతా యాదవ్
గాయని: భానుశ్రీ
సంగీతం: మదీన్ ఎస్కె
కాపోళ్ల ఇంటికాడ కామూడాటలట
పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోన తీజు పండుగట
జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిపోదమా బావ సూడబోదమా
మనం కూడిపోదమా బావ సూడబోదమా
సాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరలట
సీరాకు దగ్గ రైక పోతాలు పోస్తరట
పొయ్యివస్తవా బావ గొనితెస్తవా
నువ్వు పొయ్యివస్తవా నాకు గొనితెస్తవా
బెస్తోళ్లింటికాడ ఒట్టీ సాపలట
ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
బావ వండిపెడతరా నీకు తినపెడతరా
పెసరుబండ మీద ప్రేమా జంటలట
ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం గూడిబోదమా బావ సూడబోదమా