Showing posts with label మణికర్ణిక (2019). Show all posts
Showing posts with label మణికర్ణిక (2019). Show all posts

రా కన్నా...

రా కన్నా...
చిత్రం : మణికర్ణిక (2019)
సంగీతం : శంకర్ ఎహ్సాన్ లాయ్ 
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : హన్సిక అయ్యర్

కిలకిల నవ్వు గలగల నవ్వు
మంగళ వేళ నేడేలే
అంతఃపురానా అందాలమైనా
హాయిగ నవ్వితే వేడుకలే

కిలకిల నవ్వు గలగల నవ్వు
మంగళ వేళ నేడేలే
అంతఃపురానా అందాలమైనా
హాయిగ నవ్వితే వేడుకలే

ఎదురు చూపులే చాలూ
ఎదురు చూపులే చాలూ
రారా కన్నా రారా
రాచ వీధి నీకోసం వేచి చూసె రారా

ఈ బంధం నీతో నిత్యం కదా
మరిఇక భయమేలా మనసా ఇలా
నా బ్రతుకే నీవు కదా
ఇక రారా రారా రారా
నిను గన నా కనులారా
రా కన్నా..
ఎదురు చూపులే చాలూ

తలవాకిట లేడు తను
వస్తాడో ఇక రాడో
పూలన్నీ తనకోసం పూచినవో లేదో
వాస్తావే నాడు నువ్వు
వెలుగే తెస్తావు నువ్వు
ముసిరేను నిశలే నా మోములోన

ఈ బంధం నీతో నిత్యం కదా
మరి ఇక భయమేలా మనసా ఇలా
నా బ్రతుకే నీవు కదా
సూర్యుడు నా చెంత ఉన్న చీకటిదేలా
రా కన్నా..ఆఆఅ...

చంద్రుడిలో ప్రభ నీదే అదుగో అగుపించే
నీ ఒచ్చే సందేశం చిలిపి గాలి తెచ్చే
ప్రతి మదీ శుభాలు పంచె
ఆకశం ఆశీర్వదించె
కసిగా కరిమబ్బే కమ్మినదేలా

ఈ బంధం నీతో నిత్యం కదా
మరిఇక భయమేలా మనసా ఇలా
నా బతుకే నీవు కదా
నా ఊపిరిలో ఊపిరివై పోయావులే
రా కన్నా... రా కన్నా...
రాకన్నా... రా కన్నా...