Showing posts with label భైరవద్వీపం (1994). Show all posts
Showing posts with label భైరవద్వీపం (1994). Show all posts

విరిసినది వసంతగానం


విరిసినది వసంతగానం
చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : సింగీతం శ్రీనివాసరావు
గానం : కె.ఎస్.చిత్ర

పల్లవి :

ఆ ఆ ఆ... ఆ... ఆ.....
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం : 1

ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడై చెలికాంతుడై... దరి చేరె మెల్లగా...
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం : 2

ఋతువుమహిమేమో విరితేనె
జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరిచి
మురిసేనూ తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడె సుకుమారుడై.... జతకూడె మాయగా...
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా