Showing posts with label ప్రియమైన నీకు (2001). Show all posts
Showing posts with label ప్రియమైన నీకు (2001). Show all posts

మనసున ఉన్నది చెప్పాలనున్నది

మనసున ఉన్నది చెప్పాలనున్నది
చిత్రం  :  ప్రియమైన నీకు (2001)
సంగీతం  :  శివ శంకర్
గీతరచయిత  :  సిరివెన్నెల
నేపధ్య గానం  :  చిత్ర

పల్లవి:

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా

లలలలలలలల.....లలలలలలలల

చరణం 1:

చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకొనే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకొనే వేళలో....

కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత... అని అడగాలని
అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని.. తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా...

చరణం 2:

నీలి కన్నుల్లో ఆతని బొమ్మని చూసి
నాకింక చోటెక్కడుందని ... నిదరే కసురుకొనే రేయిలో
మేలుకొన్నాయిలే వింత కైపని వేల ఊహల్లో ఊరేగే చూపుని
...కలలే ముసురుకొనే హాయిలో

వినబడుతోందా నా ప్రియమైన నీకు... ఆశల రాగం అని అడగాలని
పగలేదో...  రేయేదో.. గురుతేలేదని... తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా....

లలలలల.... ల... ల...ల.....లలలల....ల...ల...ల....లా