Showing posts with label డిస్కోరాజా (2019). Show all posts
Showing posts with label డిస్కోరాజా (2019). Show all posts

నువ్వు నాతో ఏమన్నావో


నువ్వు నాతో ఏమన్నావో
చిత్రం : డిస్కోరాజా (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

నువ్వు నాతో ఏమన్నావో ...
నేనేం విన్నానో...
బదులేదో ఏం చెప్పావో ...
ఏమనుకున్నానో...
భాషంటూ లేని భావాలేవో ..
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేని భావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై
నీ మనసునే తాకనా