Showing posts with label ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు (1996). Show all posts
Showing posts with label ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు (1996). Show all posts

అమ్మనే అయ్యానురా నీ రాకతో



అమ్మనే అయ్యానురా నీ రాకతో
చిత్రం: ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ
గానం: చిత్ర

అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో...
ఓ జాబిలి కూనా లాలిజో ఓఓ..
నవ్వుల నాన లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం
ప్రేమకు ప్రతిరూపం
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..

చరణం 1 :

నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే
అమ్మా అనే మాటకి నేనే నోచుకుంటిరా
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..
మోసే బరువు లేకుండా
పురిటి బాధ రాకుండా
నన్నే తల్లిని చేసావయ్యా
ఇన్నినాళ్ళకీ
కన్నది ఎవరైనా
నీకున్నది ఈ అమ్మా
ఎన్నడు ఏమైనా
నను వదలకురా నాన్నా
చిగురెరుగని తోటే
చిగురించెనురా
చిరుచిరు నవ్వులకీ
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..

చరణం 2 :

కళ్ళే మూసి వుంచినా కల్లో నీవే నాయనా
ఊహల్లోను ఊపిరిలోనూ ఉయ్యాలూగరా
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..
కన్న పేగు దీవెన పెంచే ప్రేమ లాలనా
కాపాడాలి నిన్నే చిన్నా కంటిరెప్పగా
ఎక్కడ నీ ఉన్నా నా ఆశలు నీవమ్మా
నీతో నీడల్లే నా ప్రాణం వుందమ్మా
నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతై
ఎదగర ఓ నాన్నా
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..
ఒహ్హో.....ఓ..ఒహ్హో.....ఓ..

అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో...
ఓ జాబిలి కూనా లాలిజో ఓఓ..
నవ్వుల నాన లాలిజో
మా కలలకురూపం
కంటికి దీపం
ప్రేమకు ప్రతిరూపం