Showing posts with label ఆత్మబంధం (1991). Show all posts
Showing posts with label ఆత్మబంధం (1991). Show all posts

ఊరుకో ఊరుకో బంగారు కొండా



ఊరుకో ఊరుకో బంగారు కొండా
చిత్రం :  ఆత్మబంధం (1991)
రచన: సిరివెన్నెల
సంగీతం  :  కీరవాణి
నేపధ్య గానం  :  బాలు, చిత్ర

పల్లవి :

ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా

ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండా

చరణం 1 :

ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా
చల్లబడకుందీ ఎడారి.... ఎదలో..
జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా
మొండి ఊపిరింకా మిగిలుందీ...
చల్లని నీ కళ్ళలో కమ్మని కల నేను
చెమ్మగిల్లనీయకుమా కరిగిపోతానూ

దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయి జారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారు కొండా..
నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండా

చరణం 2 :

గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమనీ
తప్పుపట్టి తిట్టేవారేరీ... తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా
అంటు ఊరడించే నాన్నేరీ
చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేనని
జన్మలెన్ని దాటైనా చేరుకుంటాననీ

దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయి జారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా

ఊ...రుకో ఊరుకో బంగారు కొండా
నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయి జారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా