చిత్రం: కాలయముడు (1983)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: వేటూరి
గానం: బాలు, సుశీల
పల్లవి :
గోదారీ గట్టు కన్నా
వయ్యారీ చీరకట్టు
పదిలంగా ఉన్నదే అమ్మడూ
వరదల్లే వాటేస్తా
తరగల్లే దాటేస్తా
ఏం చేస్తావో చూస్తా.. అప్పుడు
చందమామా బొట్టు కన్నా
సన్నానీ మీసకట్టు
సరదాగా ఉందిరో పిల్లడూ
సరసంగా దువ్వేస్తా
సరసకొచ్చి కవ్విస్తా
ఏం చేస్తావో చూస్తా.. అప్పుడు
చరణం 1:
ఏటిగాలి కొడుతుంటే
పైట ఎగిరిపడుతుంటే
కన్నెతనం కసికసిగా
కాస్త బైటపడుతుంటే
నువ్వు దగ్గరౌతుంటే
ఈడు సిగ్గు పడుతుంటే
కంటిరెప్ప కసికసిగా
జంట గంటకొడుతుంటే
మనసంతా కోసిస్తా
మల్లెల్లో ముంచేస్తా
ఏమిస్తావో చూస్తా అప్పుడు
ఓ.. చేసేదేదో చేసేయ్ ఇప్పుడు
గోదారి గట్టు కన్నా
చరణం 2:
పడుచు ఎండ పడుతుంటే
లేత చెమటపుడుతుంటే
తుడుచుకునే కడకొంగే
ఒడిసి నువ్వు పడుతుంటే
నీరు ముందుకొస్తుంటే
నారు ముద్దుపెడుతుంటే
పైరంతా ఎదిగిఎదిగి
పంట చేతికొస్తుంటే
మాటలన్నీ దాటేసి
చేతలేవో చేసేస్తే
అసలు రుచులు చూపిస్తా అప్పుడు
ఆ...అప్పుడంటే ఎప్పుడు ఇంకెప్పుడు?
చందమామా బొట్టు కన్నా...
No comments:
Post a Comment
Leave your comments