నీకు నాకు బంధమేమో

చిత్రం: అమ్మాయిల శపథం (1975) 
గానం: సుశీల
రచన: ఆత్రేయ
సంగీతం: విజయభాస్కర్

పల్లవి : 

నీకు నాకు బంధమేమో ఎరుగరఎవ్వరయ్యా
నిన్ను నన్ను వేరుచేసేదెవ్వరయ్యా
ఎవ్వరయ్యా

నీకు నాకు బంధమేమో ఎరుగరఎవ్వరయ్యా
నిన్ను నన్ను వేరుచేసేదెవ్వరయ్యా
ఎవ్వరయ్యా

చరణం 1:

నా నోము ఫలము
నా పాలి వరము
నా కంట నడయాడు
నెలరాజు మొగము
నా కంట నడయాడు
నెలరాజు మొగము
ఒడిలోన నువ్వుంటే
వలదు ఏ సుఖము
వలదు ఏ సుఖము

నీకు నాకు బంధమేమో ఎరుగరఎవ్వరయ్యా
నిన్ను నన్ను వేరుచేసేదెవ్వరయ్యా
ఎవ్వరయ్యా

చరణం 2:

పాలైనా తాగి 
పవళించవేల
మారాము చేసేవు మరీ చిన్నవాడిలా
మారాము చేసేవు మరీ చిన్నవాడిలా
నేనుండ ఇతరుల జోలి నీకేల
ఆ గోల నీకేల

నీకు నాకు బంధమేమో ఎరుగరఎవ్వరయ్యా
నిన్ను నన్ను వేరుచేసేదెవ్వరయ్యా
ఎవ్వరయ్యా

చరణం 3:

నీ కౌగిలింత
నా లోకమంతా
నీ ముద్దులే నాకు పూతేనెవాగు
నీ ముద్దులే నాకు పూతేనెవాగు
నీవులేని నిముషము
నేను లేను నిజము
నేను లేను నిజము

నీకు నాకు బంధమేమో ఎరుగరఎవ్వరయ్యా
నిన్ను నన్ను వేరుచేసేదెవ్వరయ్యా
ఎవ్వరయ్యా
ఎవ్వరయ్యా

No comments:

Post a Comment

Leave your comments