అట్లతద్ది పాట

చిత్రం: పవిత్ర బంధం (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపథ్యగానం: సుశీల

పల్లవి : 

అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్ 
ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్

ఆటలనోము అట్లతద్ది
ఆటలనోము అట్లతద్ది
ఆడపిల్లలు నోచే తద్ది
వేడుకమీరగ కోరికతీరగ
ఓ చెలియా నోచవే...
జీవితమే పూచునే...

ఆటలనోము అట్లతద్ది
ఆడపిల్లలు నోచే తద్ది
వేడుకమీరగ కోరికతీరగ
ఓ చెలియా నోచవే...
జీవితమే పూచునే...

చరణం 1:

చందమామకన్న చాల అందమైన మొగుడు
సన్నజాజి పొదలకన్న చక్కనైన యిల్లు
చందమామకన్న చాల అందమైన మొగుడు
సన్నజాజి పొదలకన్న చక్కనైన యిల్లు

బంగారుబొమ్మకు కావాలే
బావయ్య నేడే రావాలే
ఈ బంగారుబొమ్మకు కావాలే
బావయ్య నేడే రావాలే

పన్నీరు జల్లేటి పబ్బాల కోసం
నోచినచో ఓ చెలీ
నీ మొగుడే జాబిలీ
నీ మొగుడే జాబిలి 
ఆటలనోము అట్లతద్ది
ఆడపిల్లలు నోచే తద్ది
వేడుకమీరగ కోరికతీరగ
ఓ చెలియా నోచవే...
జీవితమే పూచునే...

చరణం 2:

గోరింటాకు పెట్టుకుంటే చేయి పండెనమ్మా

చేయి పండితే చేపట్టే వాడొస్తాడే

తమలపాకు వేసుకోంటే నోరు పండెనమ్మా

నోరు పండితే పండంటి మొగుడొస్తాడే

గోరింటాకు పెట్టుకుంటే చేయి పండెనమ్మా
తమలపాకు వేసుకోంటే నోరు పండెనమ్మా
నీ కన్నెవలపే పండాలి 
ఆ పైన నీ ఒడి నిండాలి

నీ కన్నెవలపే పండాలి 
ఆ పైన నీ ఒడి నిండాలి

నీ ఆశ ఆకాశమే తాకిరాగ
ఊయలపై ఊగవే 
కోయిలవై కూయవే 

ఊయలపై ఊగవే 
కోయిలవై కూయవే

ఆటలనోము అట్లతద్ది
ఆడపిల్లలు నోచే తద్ది
వేడుకమీరగ కోరికతీరగ
ఓ చెలియా నోచవే...
జీవితమే పూచునే...

No comments:

Post a Comment

Leave your comments