మంచితనానికి ఫలితం ..వంచన

చిత్రం: బాంధవ్యాలు (1968) 
సంగీతం: సాలూరి హనుమంతరావు 
గీతరచయిత: సినారె
గానం: ఘంటసాల

మంచితనానికి ఫలితం ..వంచన
మనిషికి మిగిలేదేమిటి.. వేదన
ఆరని తీరని వేదన..ఆవేదన
మంచితనానికి ఫలితం

అన్నగారి మది వెన్నెల తునక
తమ్ముని మనసే మీగడ తరగ
అన్నగారి మది వెన్నెల తునక
తమ్ముని మనసే మీగడ తరగ
మరదలి మమత మరువపు మొలక
మరదలి మమత మరువపు మొలక
మరి ఏల కలిగెను ఈ కలత
ఈ కలత...
మంచితనానికి ఫలితం

పచ్చగ ఎదిగే సంసారంలో
చిచ్చులు రేపెను శని ఏదో
సిరులొలికించే పాల కుండలో
గరళము కలిపెను విధి ఏదో
విధి ఏదో...
మంచితనానికి ఫలితం

పాపమనేది పాము వంటిది
బయటపడునురా ఒకనాడు
నిజమనేది నిప్పువంటిది
ఋజువౌలేరా మరునాడు
మరునాడు...
మంచితనానికి ఫలితం ..వంచన
మనిషికి మిగిలేదేమిటి.. వేదన
ఆరని తీరని వేదన..ఆవేదన
మంచితనానికి ఫలితం

No comments:

Post a Comment

Leave your comments