జారు మిట్ఠాయా

జిన్నా (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
గాయకులు: సింహ, నిర్మలా రాథోడ్ 
సాహిత్యం: ఏ. గణేష్  

హెయ్ జారు మిట్ఠాయో 
నా జారు మిట్ఠాయా 
హే హే లెట్స్ డూ దిస్

మిట్ఠాయా మిట్ఠాయా 
జారు మిట్ఠాయా 
మిట్ఠాయా మిట్ఠాయా 
జారు మిట్ఠాయా 

నువ్వొస్తావని నేను ఓరబ్బయ్య
సిల్కుచీర కట్టుకుంటిని 
(అబ్బా)
మల్లెపూలు పెట్టుకుంటిని 
(అబ్బబ్బబ్బా)

మిట్ఠాయా మిట్ఠాయా 
జారు మిట్ఠాయా 
మిట్ఠాయా మిట్ఠాయా 
జారు మిట్ఠాయా 

నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా
సీరనేమో సింపుకుంటినీ
పూలనేమో సికరబకర చేసుకుంటినీ

మిట్ఠయ్ మిట్ఠయ్ 
జారు మిట్ఠాయా 
మిట్ఠయ్ మిట్ఠయ్ 
జారు మిట్ఠాయా 

పగటేలకొస్తవనీ ఓరబ్బయ్య
జీడిపప్పు వలిచిపెడితిని
పిడత కింద దాచిపెడితిని

పరులేమో చూస్తిరని ఓరబ్బయ్య
జీడిపప్పు ఉడతకిస్తిని
పిడతనేమో పగలకొడితిని

నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలక్క లింగో
జమ్కులకిడి జారుమిఠాయ

రాత్రి అయితే చాలు
నాకు నువ్వే గుర్తుకు వస్తావు
అబ్బయో అబ్బాయా
నీకోసం నేను దాచిందంతా
ఆరుబయట పెడతాను
అబ్బాయ అబ్బాయ… అబ్బాయో

మాటేలకొస్తవని ఓరబ్బయ్య
తమలపాకు కడిగిపెడితిని
వక్క కోసం ఎదురు చూస్తినీ

పరులేమో నవ్విరని ఓరబ్బయ్య
ఆకునేమో మడిచిపెడితినీ
వక్క లేక బిక్కుమంటినీ

మిట్ఠయ్ మిట్ఠయ్ 
జారు మిట్ఠాయా 
మిట్ఠయ్ మిట్ఠయ్ 
జారు మిట్ఠాయా 

నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలక్క లింగో
జమ్కులకిడి జారుమిఠాయ

(యో గాలి నాగేశ్వర్ రావు
ఈ యమ్మి లెక్క సూడు)

నీ జీడిపప్పు కొరికేస్తా
ఆకుపైన వక్కేస్తా
చిలక మిట్ఠయ్ చిదిమేస్తా
నీ చీరచాటు… నీ చీరచాటు
అందమంతా దోచేసుకుంటా
జమ్కులకిడి జారుమిఠాయా

నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారుమిఠాయా

హే జారు జారు… జారు జారు
జారు మిఠాయా

No comments:

Post a Comment

Leave your comments