చిత్రం: కళ్యాణ వీణ (1983)
సంగీతం: సత్యం
సాహిత్యం: మల్లెమాల
గానం: ఏసుదాస్
పల్లవి :
వేగుచుక్క మొలిచింది..
వేకువ పొడచూపింది..
వేగుచుక్క మొలిచింది..
వేకువ పొడచూపింది..
తూరుపు తెలతెలవారక ముందే..
కాలం మాటేసిందే..
నా కళ్ళను కాటేసిందే.....
కాలం మాటేసిందే....
నా కళ్ళను కాటేసిందే....
వేగుచుక్క మొలిచింది..
వేకువ పొడచూపింది..
తూరుపు తెలతెల వారక ముందే..
కాలం మాటేసిందే....
నా కళ్ళను కాటేసిందే.....
కాలం మాటేసిందే....
నా కళ్ళను కాటేసిందే....
చరణం 1:
జీవితమంటే కలకాదు..
అది కవులు రచించే కథ కాదు..
జీవితమంటే కలకాదు..
అది కవులు రచించే కథ కాదు..
కనుమరుగైనది సిరి కాదు..
అది మనదని తలచుట సరికాదు..
కుడి ఎడమైతె పొరపాటు లేదను
నానుడి సత్యం కాదు..
ఇది అందరికర్థం కాదు....
ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
వేగుచుక్క మొలిచింది..
చరణం 2:
ఎండిన మల్లెకు వెలలేదు..
మండే గుండెకు చలిలేదు..
ఎండిన మల్లెకు వెలలేదు..
మండే గుండెకు చలిలేదు..
మంచిని మించిన జతలేదు..
విధి వంచన కన్నా వ్యధలేదు..
మనసే మనిషికి చిరుచేదైతే
మనుగడకర్థం లేదు..
ఇది అందరికర్థం కాదు....
ఓ..ఓ..ఓ...ఓ...
ఓ...ఓ..ఓ..ఓ...
వేగుచుక్క మొలిచింది..