చిత్రం: కళ్యాణ వీణ (1983)
సంగీతం: సత్యం
సాహిత్యం: మల్లెమాల
గానం: ఏసుదాస్
పల్లవి :
వేగుచుక్క మొలిచింది..
వేకువ పొడచూపింది..
వేగుచుక్క మొలిచింది..
వేకువ పొడచూపింది..
తూరుపు తెలతెలవారక ముందే..
కాలం మాటేసిందే..
నా కళ్ళను కాటేసిందే.....
కాలం మాటేసిందే....
నా కళ్ళను కాటేసిందే....
వేగుచుక్క మొలిచింది..
వేకువ పొడచూపింది..
తూరుపు తెలతెల వారక ముందే..
కాలం మాటేసిందే....
నా కళ్ళను కాటేసిందే.....
కాలం మాటేసిందే....
నా కళ్ళను కాటేసిందే....