August 31, 2025

నీకిస్త తమ్ముడా

నీకిస్త తమ్ముడా
శ్రీ రాములయ్య (1998)
గాయకుడు: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీత రచయిత: శివ సాగర్

విప్పపూల చెడ్డసిగల దాచిన విల్లమ్ములన్ని
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
లహర్ జ్వాల దారిలోన దాచిన బల్లెమ్ములన్ని
నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా

గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైతుల్
నీకిస్త తమ్ముడా...బల్ నీకిస్త తమ్ముడా
అరే.. రూపాయి కొండలోన తోసిన సీపాయి పీట
నీకిస్త తమ్ముడా బల్... నీకిస్త తమ్ముడా

వడ్డాపాడు... అరే వడ్డాపాడు... 
అరె వడ్డాపాడు
పోతుగడ్డ గరుడభద్ర మెరుపుదాడి
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా

ఉడాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి
నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
అరె జాగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం
నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా

రాయలసీమ... అరె రాయలసీమ... 
అరె రాయలసీమ...
రాళ్ళలోని రతనాల మాలలల్లి
నీకిస్త తమ్ముడా. నీకిస్త తమ్ముడా
అరె రక్త వసంతాలాడే దండాకారణ్యమంత
నీకిస్త తమ్ముడా బల్... నీకిస్త తమ్ముడా

పాణిగ్రాహి కత్తిపాట మళ్ళీ పసిపాప నవ్వు
నీకిస్త తమ్ముడా బల్... నీకిస్త తమ్ముడా
అరే కైలాసం కళ్ళ వెలుగు వెంపటాకు చురుకు చూపు
నీకిస్త తమ్ముడా బల్... నీకిస్త తమ్ముడా
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా.. ఆ...