మట్కా (2024)
గాయకుడు: సాయిదేవ హర్ష
సైడ్ లిరిక్స్ గానం: భవానీ రాకేష్, హర్షవర్ధన్ చావలి
సంగీతం: భవానీ రాకేష్
సాహిత్యం: కరుణ కుమార్
పల్లవి:
రామా టాకీస్ రోడ్డు మీద
రంగురాళ్లు అమ్మేవోడా
రాతిలో ఏమున్నది
నీ సేతిలో ఉన్నది పనితనము
చరణం 1:
వల్లిపురం మేడ
ఆకాశం రంగు సీర
ఆ సీర నేనే కట్టి
నీ కోసం సూస్తూ ఉంటే
నన్ను చూడాలన్లేదా
రాళ్లు అమ్మాలన్లేదా
నన్ను చూడాలన్లేదా
వేడి దించాలన్లేదా
రామా టాకీస్
చరణం 2:
దొండపర్తి సిలక
అద్దాలరైక గిలక
నీ సూపులో ఉన్నాదే
సురుకైన సూదిమందు
నిన్ను చూడాలన్లేదే
రాళ్లు అమ్మాలన్లేదే
నిన్ను చూడాలన్లేదే
వేడి దించాలన్లేదే
రామా టాకీస్...